Cyclone Jawad: ఆంధ్రప్రదేశ్‌పై జవాద్‌ తుపాన్‌ ప్రభావం

Cyclone Jawad Over Bay Of Bengal Around November 13 : అండమాన్ సముద్రంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అది బంగాళాఖాతంలోకి ప్రవేశించి వాయుగుండంగా, ఆపై తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 13, 2021, 10:40 AM IST
  • గల్ఫ్‌ ఆఫ్‌ థాయిలాండ్‌ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అండమాన్‌ సముద్రంలో నేడు ప్రవేశించే అవకాశం
  • బంగాళాఖాతంలో జవాద్ తుపాను, ఏపీపై ప్రభావం
  • తుపాన్‌కు జవాద్ అనే పేరును సూచించిన సౌదీ అరేబియా
Cyclone Jawad: ఆంధ్రప్రదేశ్‌పై జవాద్‌ తుపాన్‌ ప్రభావం

Cyclone Jawad Brews in Bay of Bengal today Low Pressure Area Likely To Form and Move Towards Odisha And Andhra Pradesh Coasts: ఏపీలో పలు ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గుముఖం పడుతున్న సమయంలో ఇప్పుడు మరో తుపాన్‌ (Cyclone) తన ఉగ్రరూపం చూపించనుంది. అండమాన్ సముద్రంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అది బంగాళాఖాతంలోకి (Bay of Bengal) ప్రవేశించి వాయుగుండంగా, ఆపై తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇది తుపానుగా మారితే దీనిని జవాద్ (Jawad) అని పిలవనున్నారు. జవాద్ అనే పేరును సౌదీ అరేబియా (Saudi Arabia) సూచించింది. అరబిక్ భాషలో (Arabic language) జవాద్ అంటే గొప్పది అని అర్థం.

గల్ఫ్‌ ఆఫ్‌ థాయిలాండ్‌ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అండమాన్‌ సముద్రంలో (Andaman Sea)నేడు ప్రవేశించే అవకాశం ఉంది. అయితే దీని ప్రభావంతో శనివారం దాని పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

Also Read : Tractor Rally Delhi: ట్రాక్టర్ ర్యాలీలో అరెస్టయిన 83 మందికి రూ.2 లక్షల పరిహారం

అది పశ్చిమ వాయువ్య దిశగా వచ్చి..ఆగ్నేయ బంగాళాఖాతంలో (Bay of Bengal) వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయి. అనంతరం మరింత బలపడి తుపాన్‌గా బలపడితే జవాద్‌ అని నామకరణం చేయనున్నారు. ఇది కచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌పై ప్రభావం చూపనుంది. ఇది ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఏపీ తీరాన్ని (AP coast) తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం ఏపీ, ఒడిశాలపై (AP, Odisha) ఎక్కువగా ఉండొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం మరింత బలహీన పడింది.

Also Read : General Bipin Rawat: 'పాకిస్థాన్​ కంటే చైనాతోనే భారత్​కు ఎక్కువ ముప్పు'

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News