చంద్రబాబు నాయుడును కొనియాడిన హిజ్రాలు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హిజ్రాల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలు బాగున్నాయని ట్రాన్స్ జెండర్స్ కొనియాడారు.

Last Updated : Dec 18, 2017, 05:57 AM IST
చంద్రబాబు నాయుడును కొనియాడిన హిజ్రాలు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును హిజ్రాలు కొనియాడారు. ఆయన మా జీవనశైలి, మేము పడుతున్న బాధలను చూసి ఏ రాష్ట్రంలో లేనట్టుగా తగిన గుర్తింపు ఇచ్చారని పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే.. హిజ్రాల జీవన శైలి తెలుసుకోకుండా ట్రాన్స్ జెండర్ 2018 బిల్లును కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న నేపథ్యంలో..  దేశ వ్యాప్తంగా ఉన్న హిజ్రాలు ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్‌లో ధర్నాకు దిగారు. 

ఈ బిల్లు ఏకపక్షంగా ఉందని.. ఇది అమలు చేస్తే మేము నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా, ఉపాధి రంగాల్లో ట్రాన్స్ జెండర్‌లకు రిజర్వేషన్ కల్పించాలని వారు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేరళ, తమిళనాడు తరహాలో హిజ్రాలకు ఉద్యోగావకాశాలు, జీవనోపాధి కల్పించాలని కోరారు. 

ఈ సందర్భంగా తెలంగాణ, ఏపీ నుండి వచ్చిన కొంతమంది హిజ్రాలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం హిజ్రాల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని వాపోయారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హిజ్రాల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలు బాగున్నాయని కొనియాడారు. 

ఏపీ సీఎం చంద్రబాబు కేబినెట్‌ మీటింగ్‌లో హిజ్రాలకు రూ.1000 పింఛన్ ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే..! అలాగే రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని.. ఉపాధి కల్పన కోసం వారికి  నైపుణ్యశిక్షణ ఇప్పించాలని తీర్మానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తమ వర్గానికి తగిన న్యాయం చేయాలని తెలంగాణకు చెందిన కొందరు హిజ్రాలు విజ్ఞప్తి చేశారు.

Trending News