Crucial Monday: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రేపు ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. దిగువన ఏసీబీ కోర్టు నుంచి ఎగువన సుప్రీంకోర్టు వరకూ వివిధ కేసుల్లో తీర్పులు వెలువడవచ్చని అంచనా. ఈ క్రమంలో ఏం జరుగుతుందోననే ఆసక్తి ఎక్కువైంది. టీడీపీ శ్రేణుల్లో ఇప్పుడిదే చర్చ రేగుతోంది.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి చుట్టూ మరి కొన్ని కేసులు కూడా చుట్టుముడుతున్నాయి. చంద్రబాబు నాయుడికి సంబంధించి అన్ని కేసుల్లోనూ రేపు కీలక పరిణామాలు జరిగే అవకాశాలుండటంతో అందరిలో ఆసక్తి పెరిగింది. ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పలు కేసులు పెండింగులో ఉన్నాయి. వీటికి సంబంధించి తీర్పులు కూడా రేపు సోమవారం వెలువడవచ్చనే అంచనా ఉన్న నేపధ్యంలో ఏం జరుగుతుందోననే చర్చ ప్రారంభమైంది.
స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై రేపు విచారణ ఉంది. ఇప్పటికే ఈ కేసులో సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. తదుపరి విచారణను కోర్టు రేపటికి అంటే అక్టోబర్ 9వ తేదీకు వాయిదా వేసింది. ఏపీ హైకోర్టుకు సీఐడీ సమర్పించిన డాక్యుమెంట్లను తమ ముందుంచాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పరిణామంపై సుప్రీంకోర్టులో రేపు జరిగే విచారణ కీలకం కావచ్చు.
ఇక ఇదే కేసులో బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌పై ఇప్పటికే విచారణ, వాదనలు పూర్తయ్యాయి. మరోవైపు సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటీషన్‌పై సైతం వాదనలు పూర్తయ్యాయి. రేపు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందా లేక సీఐడీకు మరోసారి కస్టడీ ఇస్తుందా అనేది తేలాల్సి ఉంది. సీఐడీ తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించగా, చంద్రబాబు తరపున మరో సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే వాదించారు.
ఇక ఏపీ హైకోర్టులో మరో మూడు బెయిల్ పిటీషన్లపై రేపు అంటే సోమవారం తీర్పు వెలువడే అవకాశముంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, అంగళ్లు కేసు, ఏపీ ఫైబర్ నెట్ కేసుల్లో ముందస్తు బెయిల్ కు చంద్రబాబు దాఖలు చేసిన పిటీషన్లపై ఇప్పటికే వాదనలు ముగిశాయి. రేపు తీర్పు వెలువడవచ్చని తెలుస్తోంది. చంద్రబాబు తరపున సిద్ధార్ధ లూథ్రా వాదనలు విన్పించగా ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదించారు.
Also read: Ysrcp Election Campaign: రేపు విజయవాడలో వైసీపీ ప్రతినిధుల భేటీ, ఎన్నికల శంఖారావం పూరించనున్న జగన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Crucial Monday: చంద్రబాబు కేసుల్లో రేపు సోమవారం అత్యంత కీలకం, ఏం జరగనుంది