ముగిసిన ప్రచార గడువు; తొలి దశలో ఎన్నికలు ఎదుర్కొంటున్న రాష్ట్రాలు ఇవే..

తొలి దశ ఎన్నికల ప్రచార గడువు ముగిసింది

Last Updated : Apr 10, 2019, 04:30 PM IST
ముగిసిన ప్రచార గడువు; తొలి దశలో ఎన్నికలు ఎదుర్కొంటున్న రాష్ట్రాలు ఇవే..

తొలి దశ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ప్రచార గడువు ముగిసింది. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో  91 లోక్ సభ నియోజకవర్గాల్లో తొలి దశలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో పాటు అండమాన్ నికోబార్ మరియు లక్షదీప్ తదితర కేంద్రపాలిత ప్రాంతాల్లోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో తొలి దశలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు అసోం,బీహార్, ఛత్తీస్ గఢ్, జమ్మూ కశ్మీర్, మహారాష్ట్ర , మణిపూర్, ఒడిషా, త్రిపుర, ఉత్తర్ ప్రదేశ్ మరియు వెస్ట్ బెంగాల్ లోని కొన్ని నియోజకవర్గాలో తొలి దశలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.

స్థానాల వారీగా  పరిశీలించినట్లయితే... ఆంధ్రప్రదేశ్ (25), తెలంగాణ(17), అరుణాచల్(2), అసోం(5), బీహార్(4), చత్తీస్ గఢ్(1), జమ్ముకశ్మీర్(2), మహారాష్ట్ర(7), మణిపూర్(1), మేఘాలయ(2), మిజోరం(1), నాగాలాండ్(1), ఒడిషా(4), సిక్కిం(1),  త్రిపుర(1), యూపీ(8), ఉత్తరాఖండ్(5), వెస్ట్ బెంగాల్(2), అండమాన్(1), లక్షద్వీప్(1)లలో పోలింగ్ జరగనుంది. మే 23న ఫలితాలు వెల్లడికానున్నాయి.

లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్,  సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో 147 స్థానాలు కలిగిన ఒడిషాలో 28 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

లోక్ సభ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఏప్రిల్‌, మే నెలల్లో 7 విడతల్లో పోలింగ్‌ నిర్వహిస్తారు. తొలి విడత పోలింగ్‌ ఏప్రిల్ 11 న నిర్వహిస్తారు. రెండో దశ ఏప్రిల్‌ 18, మూడో దశ ఏప్రిల్‌ 23, నాలుగో దశ ఏప్రిల్‌ 29, ఐదో దశ మే 6, ఆరో దశ మే 12, ఏడో దశ మే19న నిర్వహిస్తారు. మే 23న ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు.

Trending News