YS Jagan: 'ఎవరూ అధైర్యపడొద్దు.. మంచి రోజులు వస్తాయి' మాజీ సీఎం జగన్‌ భరోసా

YS Jagan Assured To YSRCP Leaders And Public: సమస్యలతో బాధపడుతున్న ప్రజలు అధైర్యపడవద్దని.. మంచి రోజులు వస్తాయని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. పులివెందులలో నిర్వహించిన ప్రజా దర్బార్‌ ప్రజలతో కిటకిటలాడింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 26, 2024, 07:39 PM IST
YS Jagan: 'ఎవరూ అధైర్యపడొద్దు.. మంచి రోజులు వస్తాయి' మాజీ సీఎం జగన్‌ భరోసా

YS Jagan Praja Darbar: 'కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని.. అరాచక పాలన సాగిస్తోందని.. అకారణంగా దాడులు చేస్తోందని' మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. 'ఎవరూ అధైర్యపడొద్దు. మంచి రోజులు వస్తాయి. సమస్యలు శాశ్వతం కాదు' అంటూ భరోసా కల్పించారు. త్వరలోనే మన ప్రభుత్వం మళ్లీ వస్తుందని.. అప్పుడు అందరికీ మంచి జరుగుతుందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అరాచకాలను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. కష్టాలు ఎల్లకాలం ఉండవని.. ప్రతి ఒక్కరూ పోరాట పంథాను ఎంచుకుని ముందుకు సాగాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతున్న కూటమి నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: YS Sharmila: చేతకాని చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఎన్డీయే నుంచి బయటకు రావాలి.. వైఎస్‌ షర్మిల సంచలన డిమాండ్‌

కడప జిల్లా పర్యటనలో ఉన్న వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ పులివెందులలో పర్యటించారు. ఈ సందర్భంగా తన క్యాంప్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రజాదర్భార్‌లో ప్రజల వినతులు స్వీకరించారు. తనను కలిసిన ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారు. సమస్యలు విన్న ఆయన వారికి భరోసానిచ్చారు. కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని.. అరాచక పాలన సాగిస్తోందని.. అకారణంగా దాడులు చేస్తున్నారని స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్‌‌ జగన్‌ వాపోయారు. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారు.

Also Read: YS Jagan: వైఎస్‌ జగన్‌ సంచలన వ్యాఖ్యలు.. 'జమిలి వస్తుంది మీ జగన్ గెలుస్తున్నాడు!'

ప్రజ దర్బార్‌ కిటకిట
పలు సమస్యలతో బాధపడుతున్న ప్రజలు, వైఎస్సార్‌సీపీ నాయకులు మాజీ సీఎం జగన్‌కు విన్నవించేందుకు వచ్చారు. దీంతో ప్రజాదర్బార్‌ కిటకిటలాడింది. వేలాది సంఖ్యలో తరలిరావడంతో అక్కడి ప్రాంతం సందడిగా మారింది. వారి సమస్యలు తెలుసుకున్న జగన్‌ కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సూచించారు. అన్ని వర్గాలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ప్రజల నడ్డి విరుస్తున్న విద్యుత్‌ ఛార్జీలపై తాము పోరాడుతామని ప్రకటించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News