టెట్ వాయిదా.. ఫిబ్రవరి 5 నుంచి పరీక్షలు

ఏపీ టెట్ పరీక్షను ఫిబ్రవరి 5 నుంచి 15వ తేదీవరకు నిర్వహిస్తామని ఆ శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు.

Last Updated : Dec 27, 2017, 08:41 PM IST
టెట్ వాయిదా.. ఫిబ్రవరి 5 నుంచి పరీక్షలు

ఏపీ టెట్ పరీక్షను ఫిబ్రవరి 5 నుంచి 15వ తేదీవరకు నిర్వహిస్తామని ఆ శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. సమయం తక్కువగా ఉందని.. పరీక్ష తేదీలను కాస్త సడలించాలని విద్యార్థుల నుంచి వినతులు వచ్చాయని.. అందుకే టెట్ పరీక్షలను వాయిదా వేసినట్లు మంత్రి వివరణ ఇచ్చారు. టెట్ వాయిదా ప్రభావం డిఎస్సీ పై ఉండదని చెప్పారు. సంక్రాంతి తరువాత టెట్ పరీక్షలు జనవరి 17 నుండి 27 వరకు ఆన్లైన్ లో నిర్వహించాల్సి ఉంది.

వదంతులు నమ్మొద్దు

టెట్ కు ప్రిపేరయ్యే అభ్యర్థులు టెట్ రద్దు వదంతులు నమ్మొద్దని చెప్పారు. డిఎస్సీ కూడా ఆన్లైన్ లోనే నిర్వహించే అవకాశం ఉందన్నారు. కొత్త షెడ్యూల్ ప్రకారమే.. దరఖాస్తు స్వీకరణ, హాల్ టికెట్ల జారీ తేదీల్లో మార్పు ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఫిబ్రవరి 9న పరీక్ష జరుగుతుందన్నారు.

Trending News