APPSC Group 1 Prelims 2024 Copying In Group 1 Prelims: ఆంధ్ర ప్రదేశ్ లో ఆదివారంరోజు (మార్చి 17) గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది. ఈ క్రమంలో ఒక వ్యక్తి కాపీయింగ్ పాల్పడుతూ దొరికియిన ఘటన తీవ్ర సంచనలంగా మారింది.
ఈ ఎగ్జామ్ లో రెండు పేపర్లుగా నిర్వహించారు. ఫస్ట్ పేపర్ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, రెండో పేపర్ 2 గంటల నుంచి 4 సాయత్రం వరకు జరిగింది. అయితే.. మొదటి పేపర్ లో గ్రూప్ 1 ఎగ్జామ్ కాపీయింగ్ వ్యవహరం ఒంగోలులో వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహరం వెంగ ముక్కపాలెం రోడ్డులో ఉన్న క్విస్ ఇంజినీరింగ్ లో కాలేజీలో జరిగింది.
Read More: Viral Video: కజరారే పాటకు క్లాసులో లేడీ టీచర్ హాట్ స్టెప్పులు... వీడియో చూస్తే తట్టుకోలేరు..
ఆంధ్ర ప్రదేశ్ లో ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ కు అన్నిరకాల ఏర్పాట్లు చేశారు.అభ్యర్థులు ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా అధికారులు పకట్భంది చర్యలు చేపట్టారు. ఈక్రమంలోనే ఎగ్జామ్ సెంటర్ కు ముందుగానే చేరుకొవాలని అధికారులు అభ్యర్థులకు సూచించారు. ప్రతిఒక్క ఎగ్జామ్ సెంటర్ లలో కూడా ప్రత్యేకంగా అధికారులను నియమించారు. విద్యార్థులకు ముందుగానే హాల్ టికెట్ తోపాటు, తీసుకెళ్లాల్సిన ఐడీ కార్డులపై అనేక సూచనలు చేశారు. గంట ముందుగానే ఎగ్జామ్ లో హల్ లోకి అనుమంతిచారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
ఇదిలా ఉండగా.. ఏపీలో ఈరోజు నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో అనుకొని ఘటన చోటు చేసుకుంది. ఒక అభ్యర్థి ఏకంగా ఎగ్జామ్ హల్ కు మొబైల్ ఫోన్ పెట్టుకుని వెళ్లాడు. ఎగ్జామ్ పేపర్ ఇవ్వగానే కాపీయింగ్ స్టార్ట్ చేశాడు. దీన్ని అక్కడున్న అధికారులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతగాడు ఇతరులకు వాట్సాప్ తో క్వశ్చన్ లను పంపించినట్లు అధికారులు గుర్తించారు.
Read More: Eating More Pythons: జస్ట్ ఫర్ ఏ చెంజ్... కొండ చిలువలను తినాలంటున్న పరిశోధకులు... కారణం ఏంటంటే..?
వెంటనే అప్రమత్తమైన ఇన్విజిలెటర్లు మొబైల్ ఫోన్ లాక్కుని అతగాడిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆ అభ్యర్థిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అసలు.. ఇన్విజిలెటర్ తనిఖీలు, మెటల్ డిటెక్టర్ లను దాటి అతగాడు ఫోన్ తో క్లాస్ లో ఎలా వెళ్లాడని అధికారులు విచారణ చేపట్టారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇన్విజిలేటర్లు ఎవరైన సహాకరించారా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter