ఏపీ టెట్ 2018 ఫలితాలు వెల్లడి..!

ఈ మధ్యకాలంలో నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ 2018 (టెట్‌) తుది ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు.

Last Updated : Mar 19, 2018, 05:57 PM IST
ఏపీ టెట్ 2018 ఫలితాలు వెల్లడి..!

ఈ మధ్యకాలంలో నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ 2018 (టెట్‌) తుది ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ పరీక్షకు 4,14,120 మంది అభ్యర్థులు హాజరుకావడం విశేషం. ఈ క్రమంలో ఈ పరీక్షలకు సంబంధించి పేపరు 1లో 57.8% అభ్యర్థులు, పేపరు 2లో 37.2% అభ్యర్థులు, పేపరు 3లో 43.6% అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారని విద్యాశాఖ ప్రకటించింది.

ఈ నెల 4వ తేదిన ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ టెట్ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని విడుదల చేసింది. ఆ తర్వాత ఫలితాలను విడుదల చేయాల్సి ఉండగా... పలు సాంకేతిక కారణాల వల్ల అందులో తీవ్ర జాప్యం జరిగింది. ఎట్టకేలకు 19 మార్చి తేదిన ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు. ప్రకటించిన విధంగానే ఈ రోజు ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాలను https://aptet.apcfss.in/ వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు

Trending News