AP SSC exams: పదో తరగతి విద్యార్థులంతా పాస్

AP SSC Exams 2020 | అమరావతి: కరోనా వైరస్ (CORONAVIRUS) విలయతాండవం చేస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP govt) కూడా తెలంగాణ ప్రభుత్వం (Telangana govt) తరహాలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో పరీక్షలు నిర్వహిస్తే.. వైరస్ మరింత వ్యాపించే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం పదో తరగతితో పాటు (10th Class exams), ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ (Inter supplementary exams) పరీక్షలను రద్దు చేసింది.

Last Updated : Jun 20, 2020, 07:50 PM IST
AP SSC exams: పదో తరగతి విద్యార్థులంతా పాస్

AP SSC Exams 2020 | అమరావతి: కరోనావైరస్ (CORONAVIRUS) విలయతాండవం చేస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP govt) కూడా తెలంగాణ ప్రభుత్వం (Telangana govt) తరహాలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో పరీక్షలు నిర్వహిస్తే.. వైరస్ మరింత వ్యాపించే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం పదో తరగతితో పాటు (10th Class exams), ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ (Inter supplementary exams) పరీక్షలను రద్దు చేసింది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ (Minister Adimulapu Suresh) పదో తరగతి, ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ( Read also : ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల )

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ( AP CM YS Jaganmohan Reddy) ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం శానిటైజర్లు, మాస్కులు, ధర్మల్ స్కానర్లు సిద్ధం చేశామని, పరిస్థితి అదుపులో లేకపోవడంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పరీక్షలను రద్దు చేస్తున్నామన్నారు. పరీక్షల నిర్వహణ కోసం అధికారులు, తల్లిదండ్రులు, విద్యార్థులు కలిసి పనిచేయాలని, వారంతా ఒకేచోట సమూహంగా ఏర్పడటం శ్రేయస్కరం కాదన్నారు. పదో తరగతి విద్యార్థులతోపాటు ఇంటర్‌లో ఫెయిల్ అయిన ఫస్ట్, సెకండియర్ విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేస్తున్నామని, వారంతా పాస్ అయినట్లేనని  వెల్లడించారు. ( Read also: ఏపీలో భారీగా కరోనా కేసులు.. తాజాగా నలుగురి మృతి )

ముందుగా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 6లక్షల 30వేలమంది విద్యార్థులకు జూలై 10నుంచి 17 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు 11 పేపర్లను కాస్తా ఆరు పేపర్లకే కుదించింది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో విద్యార్థులంతా పై తరగతులకు ప్రమోట్ కానున్నారు. ఇదిలాఉంటే ఏపీ ప్రభుత్వం కంటే ముందుగా తెలంగాణ, పుదుచ్చేరి, తమిళనాడు ప్రభుత్వాలు పది పరీక్షలను రద్దుచేసి విద్యార్థులకు గ్రేడ్లు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Trending News