AP Corona Second Wave: సెక్రటేరియట్ ఉద్యోగులకు కరోనా సెగ, వర్క్ ఫ్రం హోం కోసం ఉద్యోగుల విజ్ఞప్తి

AP Corona Second Wave: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య రెట్టింపవుతోంది. ఏపీ సెక్రేటేరియట్‌కు కరోనా సెగ తాకింది. ఏకంగా 60 మందికి పైగా ఉద్యోగులు కరోనా బారిన పడ్డట్ట సమాచారం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 17, 2021, 12:59 PM IST
AP Corona Second Wave: సెక్రటేరియట్ ఉద్యోగులకు కరోనా సెగ, వర్క్ ఫ్రం హోం కోసం ఉద్యోగుల విజ్ఞప్తి

AP Corona Second Wave: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య రెట్టింపవుతోంది. ఏపీ సెక్రేటేరియట్‌కు కరోనా సెగ తాకింది. ఏకంగా 60 మందికి పైగా ఉద్యోగులు కరోనా బారిన పడ్డట్ట సమాచారం.

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave)కోరలు చాస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య ఇప్పటికే 6 వేలకు చేరుతోంది. ప్రతిరోజూ కరోనా యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే కరోనా వైరస్(Coronavirus spread)వ్యాప్తి ఆగడం లేదు. ఎక్కడికక్కడ లాక్‌డౌన్(Lockdown) , కర్ఫ్యూపై ( Curfew) చర్చ సాగుతోంది. రాష్ట్ర సచివాలయాని ( Ap Secretariat) కి కూడా కరోనా సెగ తాకింది. ఇప్పటికే 60 మందికి పైగా ఉద్యోగులకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణైంది. ఉద్యోగులతో పాటు కుటుంబసభ్యులకు కూడా కరోనా వైరస్ సోకినట్టు తేలింది. అన్ని శాఖల ఉద్యోగులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 2 వందల మంది సచివాలయ ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించారు. 

కరోనా సంక్రమణ వేగంగా ఉండటంతో ఉద్యోగుల్లో భయం నెలకొంది. విధులకు రావాలంటే వణికిపోతున్నారు. వర్క్ ఫ్రం హోం (Work from Home) అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో చూస్తూ చూస్తుండగానే యాక్టివ్ కేసుల సంఖ్య 35 వేలు దాటేసింది. రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 35 వేల 962 శాంపిల్స్‌ని ( Covid tests) పరీక్షించగా 6 వేల 96 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లా వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు చూస్తే.. అనంతపురం జిల్లాలో 313, చిత్తూరు జిల్లాలో 1,024, తూర్పుగోదావరి జిల్లాలో 750, గుంటూరు జిల్లాలో 735, కడప జిల్లాలో 243, కృష్ణాజిల్లాలో 246, కర్నూలు జిల్లాలో 550, నెల్లూరు జిల్లాలో 354 కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి దృష్టి ఇప్పటికే స్థానిక అధికారులతో ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే గుంటూరు జిల్లాలోని మూడు మండలాల్లో లాక్‌డౌన్ (Lockdown) విధించారు. 

Also read: ACB Raids: ఆ పంచాయితీ కార్యదర్శి ఆస్థుల విలువ 50 కోట్లు దాటేశాయి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Faceboon

Trending News