Nara Lokesh: ట్రెండింగ్ లో నారా లోకేష్.. ఒక్క మెసేజ్ తో విద్యార్థుల కళ్లలో ఆనందం.. అసలు స్టోరీ ఏంటంటే..?

Minister nara Lokesh: మంత్రి నారాలోకేష్ పాలనలో తన దైన మార్క్ చూపిస్తున్నారు. నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ఎక్కడ సమస్యలున్న వెంటనే పరిష్కరమయ్యేలా అధికారులకు ఆదేశాలు జారీచేస్తున్నారు. ఇటీవల తన నియోజక వర్గంలో ప్రజాదర్బర్ కార్యక్రమంలో కూడా ఆయన సమస్యలను వెంటనే సాల్వ్ అయ్యే విధంగా ఆదేశించారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Jul 21, 2024, 07:29 PM IST
  • నారాలోకేష్ కు మెయిల్ పెట్టిన విద్యార్థులు..
  • గ్రామంలో ఊహించని విధంగా మార్పులు..
Nara Lokesh: ట్రెండింగ్ లో నారా లోకేష్.. ఒక్క మెసేజ్ తో  విద్యార్థుల కళ్లలో ఆనందం.. అసలు స్టోరీ ఏంటంటే..?

Ap minister nara Lokesh solved bus problem to marlamadi village Kurnool: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలు కూటమికి బ్రహ్మరథం పట్టారు. ఈ నేపథ్యంలో సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పాలన పగ్గాలు చేపట్టారు. ఇక మంగళగిరి నుంచి లోకేష్ సైతం భారీమెజార్టీతో గెలిచారు. యువగళం పాదయాత్రలలో లోకేష్ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా.. ప్రజలు కూడా నారాలోకేష్ కు బ్రహ్మరథం పట్టారు. గతంలో అధికారంలో ఉన్న వైసీపీ సర్కారు, నారాలోకేష్ ను ఎల్లప్పుడు కూడా ట్రోలింగ్ చేస్తుండేవారు. మంగళగిరిలో గెలిస్తే చాలని కూడా సవాల్ లు విసిరారు.

Read more: TGRTC Free bus: అట్లుంటదీ మన్ తోనీ.. బస్సులో వెల్లుల్లీ పొట్టు తీసుకుంటూ జర్నీచేస్తున్న మహిళ.. వీడియో వైరల్..

ఈ నేపథ్యంలో.. విమర్శించిన వారందరికి నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగానే కాకుండా.. భారీ మెజార్టీతో సైతం గెలిచి, మంత్రి అయ్యారు. ఇదిలా ఉండగా.. తాజాగా, నారా లోకేష్ మరోసారి ట్రెండింగ్ లో నిలిచారు. ఆయన ఒక మెయిల్ తో గ్రామస్థుల కళ్లలో ఆనందం వచ్చేలా చేశారు.

పూర్తి వివరాలు..

కర్నూలు జిల్లా హోలగుంద మండలం మార్లమడి గ్రామానికి సరైన సమయానికి బస్సు సౌకర్యం లేదు. బస్సు  ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. దీంతో మరో గ్రామానికి వెళ్లాలంటే గ్రామస్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికంగా.. ఆటోలు, జీపులు వంటివి ఉన్నప్పటికీ ఏ సమయానికి వస్తాయనేదీ తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో చాలా మంది పర్సనల్ వెహికిల్స్ లను ఉపయోగిస్తున్నారు.

కానీ చాలా మంది మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పనులకు,చదువుల కోసం వెళ్లే వారు.. అవస్థలు పడుతున్నారు. దీంతో తమ సమస్యను మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లాలని ఆ విద్యార్థులు నిర్ణయించుకున్నారు. వెంటనే విద్యార్థులంతా కలిసి కూర్చుని మాట్లాడుకుని మంత్రి లోకేష్ కు మెయిల్ చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న వెంటనే మంత్రి లోకేష్ కు తమ గ్రామం సమస్యలను, బస్సులు లేకపోవడం వల్ల కల్గుతున్న ఇబ్బందుల్ని పూర్తిగా రాసి మెయిల్ చేశారు.

Read more: Crocodile: ఇదేం పైత్యం.. 300 మొసళ్లు ఉన్న సరస్సులో  బైక్ తో స్టంట్.. చివరకు ఊహించని ట్విస్ట్... వీడియో వైరల్..  

ఈ క్రమంలో.. దీనిపై నారాలోకేష్ స్పందించారు. వెంటనే.. రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రవాణామంత్రి రంగంలోకి దిగి, ఆదోనీ ఆర్టీసీ డిపో అధికారులతో మాట్లాడారు. ఈ క్రమంలో.. మార్లమడి గ్రామానికి బస్సు సర్వీసును ప్రారంభించారు. దీంతో మంత్రి నారా లోకేష్‌కు విద్యార్థి సంఘాలు, మార్లమడి గ్రామస్థులు, విద్యార్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News