Minister Gummanur Jayaram: రూ.50 కోట్లు, మంత్రి పదవితో చంద్రబాబు నాకూ ఎరవేశారు: మంత్రి గుమ్మనూరు

Minister Gummanur Jayaram slams Chandrababu Naidu | కర్నూలు : మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ( Ayyanna Patrudu ) తనపై చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ అయ్యన్నపాత్రుడికి కౌంటర్ ఇచ్చిన ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం ( Minister Gummanuru Jayaram ).. పనిలోపనిగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా సంచలన ఆరోపణలు చేశారు.

Last Updated : Oct 7, 2020, 12:16 AM IST
Minister Gummanur Jayaram: రూ.50 కోట్లు, మంత్రి పదవితో చంద్రబాబు నాకూ ఎరవేశారు: మంత్రి గుమ్మనూరు

Minister Gummanur Jayaram slams Chandrababu Naidu | కర్నూలు : మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ( Ayyanna Patrudu ) తనపై చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ అయ్యన్నపాత్రుడికి కౌంటర్ ఇచ్చిన ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం ( Minister Gummanuru Jayaram ).. పనిలోపనిగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా సంచలన ఆరోపణలు చేశారు. 2014 ఎన్నికల తర్వాత తనను వైసీపీ వీడి టీడీపీలో వస్తే రూ. 50 కోట్లతో పాటు మంత్రి పదవి ఇస్తామని చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) ఎరవేశారని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. కానీ తాను ఆ ప్రలోభాలకు లొంగలేదని మంత్రి జయరాం గుర్తుచేసుకున్నారు. Also read : AP & TS:ఏపీలోని ప్రాజెక్టులు ఆపకుంటే..తెలంగాణలో బాబ్లీ తరహా ప్రాజెక్ట్: సీఎం కేసీఆర్

ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడిపై తీవ్రస్థాయిలో ద్వజమెత్తిన మంత్రి జయరాం.. 'ఇవాళ తనపై ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు సరే.. మరి 2 ఎకరాల చంద్రబాబు ఈరోజు ఈ స్థాయికి ఎలా ఎదిగారో అయ్యన్నపాత్రుడు అడిగితే బాగుంటుంది' అని చురకలు అంటించారు. ఒక బీసీ మంత్రిపై లేనిపోని ఆరోపణలు చేసి అణగదొక్కాలని చూస్తున్నారని అయ్యన్నపాత్రుడిపై మంత్రి మండిపడ్డారు. Also read : AP COVID-19 : తాజాగా 5,795 కరోనా కేసులు.. 33 మంది మృతి

అచ్చెన్నాయుడికీ మంత్రి జయరాం చురకలు..
అచెన్నాయుడి ( Atchennaidu ) తరహాలో తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. తాను మంత్రిగా ఛార్జ్ తీసుకున్నప్పుడు పలు డిస్పెన్సరీలను తనిఖీ చేయగా వాటిలో మెడిసిన్స్ అందుబాటులో లేవని తేలింది. మెడిసిన్ లేనప్పటికీ.. బాకీలు మాత్రం చెల్లించాల్సి వచ్చింది. ఇదేంటని విచారణకు ఆదేశిస్తేనే దాని వెనుకున్న కుంభకోణానికి ( ESI scam ) సంబంధించి ఈ వాస్తవాలన్నీ వెలుగుచూశాయని మంత్రి జయరాం వ్యాఖ్యానించారు. Also read : 
AP ECET Results 2020 Link: ఏపీ ఈసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News