బడి ఈడు పిల్లల తల్లిదండ్రులకు మరో తీపి కబురు.. ఏడాదికి రూ.15,000 సాయం

మరో తీపి కబురు.. ఏడాదికి రూ.15,000 సాయం

Last Updated : Jun 14, 2019, 05:15 PM IST
బడి ఈడు పిల్లల తల్లిదండ్రులకు మరో తీపి కబురు.. ఏడాదికి రూ.15,000 సాయం

గుంటూరు: చిన్నారుల్ని బడికి పంపే ప్రతీ తల్లికి అమ్మఒడి పథకం కింద ఏడాదికి రూ.15,000 ఆర్థిక ప్రోత్సాహంగా అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి పునరుద్ఘాటించారు. ప్రజా సంకల్ప యాత్రలో వుండగానే ప్రకటించిన హామీలలో అమ్మఒడి పథకం కూడా ఒకటనే సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా పెనుమాకలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు సరైన వసతలు లేక ఇబ్బందులు పడుతున్నారని... అందుకే విద్యావ్యవస్థపై దృష్టి కేంద్రీకరించి  పూర్తిస్థాయిలో మార్పు తీసుకొస్తామని అన్నారు. 

ప్రైవేట్ విద్యా సంస్థలు చాలా అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేసి విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని చెబుతూ ఇకపై మీ పిల్లల చదువును తానే చూసుకుంటానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. విద్యా సంవత్సరం ఆరంభం అవుతున్న తరుణంలో వైఎస్ జగన్ చేసిన ఈ ప్రకటన విద్యార్థుల తల్లిదండ్రులకు తీపి కబురులా అనిపిస్తోంది.

Trending News