సివిల్స్ ఉచిత శిక్షణ ప్రకటన విడుదల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రారంభమైన ఎన్టీఆర్ విద్యోన్నతి పథకంలో భాగంగా బీసీ,ఈబీసీ, కాపు కులాల విద్యార్థులకు సివిల్స్ పరీక్ష ప్రిపరేషనుకు గాను ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ తెలిపింది. 

Last Updated : May 25, 2018, 01:44 PM IST
సివిల్స్ ఉచిత శిక్షణ ప్రకటన విడుదల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రారంభమైన ఎన్టీఆర్ విద్యోన్నతి పథకంలో భాగంగా బీసీ,ఈబీసీ, కాపు కులాల విద్యార్థులకు సివిల్స్ పరీక్ష ప్రిపరేషనుకు గాను ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ తెలిపింది. అందుకు గాను నిర్వహించే ప్రవేశపరీక్షకు ఈ నెల 24వ తేది నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. జూన్ 25, 26 తేదిల్లో అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఈ ప్రవేశ పరీక్ష జరగనుంది.

సివిల్స్ ప్రిలిమ్స్‌కు సంబంధించిన సిలబస్‌నే ఈ ఎంట్రన్స్ టెస్టుకు సిలబస్‌గా శాఖ నిర్ణయించింది. 32 ఏళ్ల వయసు కంటే తక్కువ ఉన్న అభ్యర్థులే ఈ ఎంట్రన్స్ టెస్టు రాయడానికి అర్హులు. అలాగే కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలకు మించరాదు.

ప్రవేశ పరీక్షకు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. ఆసక్తి గల అభ్యర్థులు www.jnanabhumi.ap.gov.in వెబ్‌సైటు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 2015-16, 2016-17 సంవత్సరాల్లో ఉచితంగా శిక్షణ పొందినవారు మరల దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. 

Trending News