AP New Districts Details: ఏపీ 26 కొత్త జిల్లాల స్వరూపం ఇదే!

AP New Districts Detailed Proposal: ఏపీలో ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 కొత్త జిల్లాలు ఏర్పాటు. కొత్త జిల్లాల స్వరూపం ఇలా ఉండనుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2022, 10:58 AM IST
  • ఏపీలో 26 కొత్త జిల్లాల ఏర్పాటు
  • ఆన్‌లైన్‌లో ఆమోదించిన కేబినెట్
  • నేడు నోటిఫికేషన్‌ రిలీజ్‌
AP New Districts Details: ఏపీ 26 కొత్త జిల్లాల స్వరూపం ఇదే!

Andhra Pradesh New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు మంత్రిమండలి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు (AP 26 new districts) ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఇవాళ​ అంటే.. బుధవారం నోటిఫికేషన్‌ రిలిజ్ చేయనుంది. 

రానున్న ఉగాది నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని ఏపీ సర్కార్‌‌ భావిస్తోంది. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలనే ప్రతిపాదనకు లోబడుతూనే.. భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను అలాగే సౌలభ్యాలను కూడా దృష్టిలో ఉంచుకుని కొత్త జిల్లాల (AP New Districts) సరిహద్దులను నిర్ణయించడంలో ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. 

ఏపీలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలుండగా, అరకు లోక్‌సభ స్థానం భౌగోళిక విస్తీర్ణం చాలా పెద్దదిగా ఉండడంతో, దాన్ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్నారు. ఇక జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా, ఇప్పుడున్న జిల్లా కేంద్రాలతో (AP 13 districts) ఏర్పాటైన జిల్లాలకు పాతపేర్లనే ఉంచనున్నారు.

మిగతా జిల్లాల్లో కొన్నిటింని వాటి జిల్లా కేంద్రాల పేర్లతో ఏర్పాటు చేయగా.. కొన్నింటికి ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజు, బాలాజీ, అన్నమయ్య, సత్యసాయిబాబాల పేర్లు పెట్టాలని డిసైడ్ అయింది ఏపీ కేబినెట్.

శ్రీకాకుళం లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాలతో పాటు విజయనగరం లోక్‌సభ స్థానం పరిధిలోని ఎచ్చెర్ల శాసనసభ నియోజకవర్గాన్ని కలిపి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌గా ఏర్పాటు చేయనున్నారు.

AP Districts

ఇక ఎచ్చెర్ల మినహా విజయనగరం లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాలకు విశాఖ లోక్‌సభ స్థానం పరిధిలోని శృంగవరపు కోట శాసనసభ స్థానాన్ని కలిపి విజయనగరం జిల్లా ఏర్పాటు చేయనున్నారు.

AP Districts
శృంగవరపు కోట తప్ప విశాఖ లోక్‌సభ స్థానం పరిధిలోని మిగతా ఆరు నియోజకవర్గాలతో విశాఖపట్నం జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం విశాఖపట్నం, విజయనగరం జిల్లాల పరిధిలో ఉన్న పెదగంట్యాడ మండలాన్ని విశాఖ జిల్లా పరిధిలోకి తీసుకురానున్నారు.అనకాపల్లి లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ స్థానాలతో కొత్తగా అనకాపల్లి జిల్లా ఏర్పాటు చేయనున్నారు.

అరకు లోక్‌సభ స్థానాన్ని రెండు జిల్లాలుగా విభజించనున్నారు. పార్వతీపురం కేంద్రంగా పార్వతీపురం, కురుపాం, పాలకొండ, సాలూరు నియోజకవర్గాలతో పార్వతీపురం జిల్లాను ఏర్పాటు చేయనున్నారు.

AP Districts

రంపచోడవరం, పాడేరు, అరకు వ్యాలీ నియోజకవర్గాలతో కలిపి పాడేరు కేంద్రంగా కొత్తగా అల్లూరి సీతారామరాజు పేరుతో ఒక జిల్లా ఏర్పాటుకాబోతుంది.

అమలాపురం లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో అమలాపురం కేంద్రంగా కోనసీమ పేరుతో ఒక కొత్త జిల్లా ఏర్పాటు కానుంది. 

కాకినాడ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో కాకినాడ జిల్లా ఏర్పాటుకానుంది.

AP Districts

రాజమహేంద్రవరం కేంద్రంగా రాజమండ్రి లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో తూర్పు గోదావరి జిల్లా ఏర్పాటుకానుంది

ఏలూరు లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ స్థానాలతో ఏలూరు కేంద్రంగా ఒక కొత్త జిల్లా ఏర్పాటుకానుంది.

నరసాపురం లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పాటు కానుంది.

మచిలీపట్నం లోక్‌సభ స్థానం పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాలతో కలిపి మచిలీపట్నం కేంద్రంగా కృష్ణా జిల్లా ఏర్పాటు కానుంది

విజయవాడ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో కలిపి విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్‌ జిల్లా పేరుతో కొత్త డిస్ట్రిక్ట్‌ ఏర్పాటుకానుంది.

ఇక గుంటూరు లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ స్థానాలతో కలిపి గుంటూరు జిల్లా ఏర్పాటుకానుంది.

బాపట్ల లోక్‌సభ స్థానం పరిధిలోని సంతనూతలపాడు ఒంగోలుకు సమీపంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజల సౌకర్యం కోసం సంతనూతలపాడు తప్ప బాపట్ల లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాలతో బాపట్ల కేంద్రంగా జిల్లా ఏర్పాటు కానుంది. బాపట్ల కేంద్రంగా ఏర్పాటు చేసే డిస్ట్రిక్ట్‌కు భావపురిగా పేరు పెట్టనున్నారు.

AP Districts

నరసరావుపేట లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ఏర్పాటు చేయనున్నారు.

ఒంగోలు లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకర్గాలకు బాపట్ల లోక్‌సభ స్థానం పరిధిలోని సంతనూతలపాడు శాసనసభ స్థానాన్ని కలిపి ఒంగోలు కేంద్రంగా ప్రకాశం జిల్లా ఏర్పాటు చేయనున్నారు.

తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలోని సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరుకు సమీపంలో ఉంటుంది. అయితే ప్రజల సౌకర్యార్ధం నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలు, తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలోని సర్వేపల్లితో కలిపి నెల్లూరు కేంద్రంగా శ్రీపొట్టిశ్రీరాములు జిల్లా ఏర్పాటుకానుంది.

సర్వేపల్లి శాసనసభ స్థానం తప్ప తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు చిత్తూరు లోక్‌సభ స్థానం పరిధిలోని చంద్రగిరి శాసనసభ నియోజకవర్గాన్ని కలిపి తిరుపతి కేంద్రంగా బాలాజీ జిల్లా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది.

చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం పోనూ... చిత్తూరు లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు శాసనసభ స్థానాలకు రాజంపేట లోక్‌సభ స్థానం పరిధిలోని పుంగనూరును కూడా చేర్చి చిత్తూరు కేంద్రంగా చిత్తూరు జిల్లా ఏర్పాటు చేయాలని ప్రతిపాదన.

పుంగనూరు శాసనసభ నియోజకవర్గంపోనూ రాజంపేట లోక్‌సభ స్థానం పరిధిలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలతో రాయచోటి కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక రాయచోటి కేంద్రంగా ఏర్పాటు చేసే జిల్లాకు అన్నమయ్య జిల్లాగా పేరు పెట్టనున్నారు.

కడప లోక్‌సభ స్థానం పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాలతో కడప కేంద్రంగా వైఎస్సార్‌ జిల్లా ఏర్పాటుకానుంది.

నంద్యాల లోక్‌సభ స్థానం పరిధిలోని పాణ్యం శాసనసభ నియోజకవర్గం కర్నూలుకు సమీపంలో ఉంటుంది. అయితే ప్రజల సౌకర్యార్ధం.. కర్నూలు లోక్‌సభ స్థానం పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాలకు పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాన్ని కలిపి కర్నూలు జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు.

AP Districts

పాణ్యం తప్ప నంద్యాల లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాలతో నంద్యాల కేంద్రంగా జిల్లా ఏర్పాటుకానుంది.

AP Districts

హిందూపురం లోక్‌సభ స్థానం పరిధిలోని రాప్తాడు నియోజకవర్గం అనంతపురానికి సమీపంలో ఉంటుంది. దీంతో అనంతపురం లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ స్థానాలకు రాప్తాడు అసెంబ్లీ స్థానాన్ని కలిపి అనంతపురం డిస్ట్రిక్ట్‌ ఏర్పాటుకు ప్రతిపాదన తెచ్చారు.

Also Read : Breaking News: మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్.. స్వల్ప లక్షణాలతో క్వారంటైన్

రాప్తాడు తప్ప హిందూపురం లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాలతో పుట్టపర్తి కేంద్రంగా జిల్లా ఏర్పాటు కానుంది. పుట్టపర్తి కేంద్రంగా ఏర్పాటు చేసే జిల్లాకు సత్యసాయి డిస్ట్రిక్ట్‌గా (District) పేరు పెట్టనున్నారు.

Also Read : Republic day 2022: రిపబ్లిక్ డే వేడుకల్లో శకటాలను ఎలా ఎంపిక చేస్తారో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News