AP: ఏబీ వెంకటేశ్వరరావుపై మరిన్ని అభియోగాలు..చర్యలు తప్పవా

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వ కొరడా ఝులిపిస్తోంది. క్రమశిక్షణా చర్యలు తీసుకోడానికి సిద్ధమవుతోంది. లాబీయింగ్ చేస్తే సహించేది లేదని స్పష్టం చేసింది.

Last Updated : Dec 19, 2020, 02:43 PM IST
  • ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై మరిన్ని అభియోగాలు
  • నిఘా పరికరాల్ని ఇతర విషయాలకు ఉపయోగించారనే ఆరోపణలు
  • 15 రోజుల్లోగా రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని..లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసిన ప్రభుత్వం
AP: ఏబీ వెంకటేశ్వరరావుపై మరిన్ని అభియోగాలు..చర్యలు తప్పవా

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వ కొరడా ఝులిపిస్తోంది. క్రమశిక్షణా చర్యలు తీసుకోడానికి సిద్ధమవుతోంది. లాబీయింగ్ చేస్తే సహించేది లేదని స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్( Andhra pradesh ) గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిఘా పరికరాల కొనుగోలు కేసులో మాజీ ఇంటెలిజెన్స్ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ( Ap intelligence ex chief ab venkateswara rao )పై ప్రభుత్వం తీవ్ర చర్యలకు సిద్ధమవుతోంది. ప్రభుత్వం తరపున కొనుగోలు చేసిన నిఘా పరికరాల్ని విపక్ష నేతలపై నిఘా కోసం వాడారంటూ తాజా ఆరోపణలు చేసింది. అఖిల భారత్ సర్వీస్ రూల్ నెంబర్ 8 కింద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ( Ap government ) నిర్ణయించింది. శాఖాపరమైన సమాచారాన్ని గోప్యంగా ఉంచడంలో విఫలమయ్యారనే ఆరోపణలు నమోదయ్యాయి.

ఈ ఆరోపణలకు సంబంధించి ఏబీ వెంకటేశ్వరరావుకు నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం 15 రోజుల్లో లిఖితపూర్వక వివరణ కోరింది. లేనిపక్షంలో సంబంధిత అధికారి ముందు హాజరై వాదన విన్పించాలని కోరింది. లేనిపక్షంలో అభియోగాలన్ని అంగీకరించినట్టు భావించి..విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులిచ్చారు. తనపై నమోదైన అభియోగాలపై దర్యాప్తు అధికారులపై రాజకీయనేతలతో గానీ..పెద్దలతో గానీ ఒత్తిళ్లు తీసుకురాకూడదని సూచించారు. 

Also read: AP: మూడు నెలల విద్యుత్ ఛార్జీలు రద్దు..వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు

మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చుట్టూ ఇప్పుడు ఉచ్చు పూర్తిగా బిగుసుకుంటోంది. ప్రభుత్వ నోటీసులకు సమాధానం ఇవ్వక తప్పని పరిస్థితి ఎదురైంది. ఇజ్రాయిల్‌ ( Izrael ) కు చెందిన ఆర్‌టీ ఇన్‌ఫ్లాటబుల్ ఆబ్జెక్ట్స్ ఇండియా లిమిటెడ్‌కు కాంట్రాక్టు దక్కేలా ఏపీ వెంకటేశ్వరరావు ఒత్తిడి తీసుకొచ్చారు. పరికరాల నాణ్యత, సమర్ధత, గ్యారంటీ విషయాల్లో రాజీపడి తన కుమారుడైన చేతన్ సాయికృష్ణకు కాంట్రాక్ట్ ఇప్పించుకున్నారనే ఆరోపణలున్నాయి.

Also read: AP: కేంద్రమే ప్రతివాది ఇక..విచారణ వాయిదా

Trending News