Ys jagan: ఏపీలో పెట్టుబడులకై స్వయంగా రంగంలో దిగిన సీఎం వైఎస్ జగన్, ఇవాళ ఢిల్లీలో బిజీ బిజీ

Ys jagan: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పెట్టుబడుల రాబట్టడంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టి సారించారు. మార్చ్‌లో జరిగే సమ్మిట్ సన్నాహక మీటింగ్ ఢిల్లీలో ఏర్పాటు చేశారు వైఎస్ జగన్. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 31, 2023, 08:14 AM IST
Ys jagan: ఏపీలో పెట్టుబడులకై స్వయంగా రంగంలో దిగిన సీఎం వైఎస్ జగన్, ఇవాళ ఢిల్లీలో బిజీ బిజీ

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిన్న జనవరి 30వ తేదీ రాత్రి ఢిల్లీకు బయలుదేరి వెళ్లారు. ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశపు సన్నాహక సమావేశంలో పాల్గొననున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

ఏపీలో పెట్టుబడుల ఆహ్వానం కోసం మార్చ్ 3, 4 తేదీల్లో ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరగనుంది. ఈ గ్లోబల్ సమ్మిట్‌లో బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు గవర్నమెంట్ సమావేశాలు, నిర్ధిష్టమైన ప్లీనరీ సెషన్లు జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ గ్లోబల్ సమ్మిట్‌ను. ఏపీలో పెద్దఎత్తున పెట్టుబడుల ఆహ్వానమే సమ్మిట్ ప్రధాన లక్ష్యం. దీనికి సంబంధించిన సన్నాహక సమావేశాన్ని ఢిల్లీ లీలా ప్యాలెస్ హోటల్‌లో ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ సమావేశానికి వివిధ దేశాల రాయబారులు పారిశ్రామిక వేత్తల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆహ్వానించారు. ఏపీలో పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల రాయబారులతో జగన్ సమావేశం కానున్నారు. 

విశాఖలో జరిగే అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సును విజయవంతం చేసేందుకు దేశంలోని వివిధ నగరాల్లో కార్యక్రమాలు నిర్వహించనుంది రాష్ట్ర ప్రభుత్వం. తొలి సన్నాహక సమావేశాన్ని ఇవాళ ఢిల్లీలో ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్‌కు 28 మంది విదేశీ పెట్టుబడిదారులు, 44 దేశాల రాయబారులకు ఆహ్వానం అందింది. ఏపీ అడ్వాంటేజ్ థీమ్‌తో రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాల్ని ముఖ్యమంత్రి జగన్ వివరించనున్నారు. 

వివిధ రకాల పరిశ్రమల, వ్యాపారాలకు ఏపీలో ఉన్న అనుకూల వాతావరం, పారిశ్రామిక, లాజిస్టిక్స్ మౌళిక సదుపాయాలు, స్కిల్డ్ హ్యూమన్ రిసోర్సెస్ బలంగా మారనుందనే విషయాన్ని ఏపీ ప్రభుత్వం ఇన్వెస్టర్ల దృష్టికి తీసుకెళ్లనుంది. త్వరలో ఇలాంటి సన్నాహక సమావేశాల్ని అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై నగరాల్లో సైతం రోడ్డు షోల ద్వారా నిర్వహించనుంది. 

Also read: Pawan Kalyan: పొత్తులపై పవన్ కళ్యాణ్ సందిగ్ధం.. జనసేన దారెటు..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News