Srisailam fire tragedy: శ్రీశైలం ఘటనపై స్పందించిన ఏపీ సీఎం

శ్రీశైలంలో తెలంగాణ వైపున ఉన్న ఎడమగట్టు జలవిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ( Srisailam fire tragedy ) తొమ్మిది మంది మృతి చెందిన ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Last Updated : Aug 21, 2020, 09:07 PM IST
Srisailam fire tragedy: శ్రీశైలం ఘటనపై స్పందించిన ఏపీ సీఎం

అమరావతి: శ్రీశైలంలో ( Srisailam ) తెలంగాణ వైపున ఉన్న ఎడమగట్టు జలవిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ( Srisailam fire tragedy ) తొమ్మిది మంది మృతి చెందిన ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని సీఎం జగన్ ఆవేదన వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. Also read : Srisailam Fire Accident: సీఎం జగన్ శ్రీశైలం పర్యటన రద్దు

 

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో ( Srisailam fire accident ) తొమ్మిది మంది చనిపోయిన ఘటనపై తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సీఐడి విచారణకు ఆదేశించారు. అదనపు డీజీపీ గోవింద్ సింగ్ ఈ ఘటనపై విచారణ చేపట్టనున్న సీఐడి బృందానికి నేతృత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఈ ఘటనపై నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ స్పందిస్తూ.. అగ్ని ప్రమాదం ఘటనలో చనిపోయిన 9 మందిలో ఏడుగురు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థకు చెందిన ఉద్యోగులు కాగా మరో ఇద్దరు అమరాన్ బ్యాటరీస్ సంస్థకు చెందిన వారు అని వెల్లడించినట్టు పీటీఐ పేర్కొంది. Also read : Rhea Chakraborty: వైరల్‌గా మారిన రియా చక్రవర్తి, మహేష్ భట్ మధ్య వాట్సాప్ చాటింగ్

Trending News