New Districts Launch: ఏపీలో కొత్త జిల్లాలు ప్రారంభమైపోయాయి. రాష్ట్రంలోని 26 కొత్త జిల్లాలు, 72 రెవిన్యూ డివిజన్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి పరిపాలన కొత్త జిల్లాల్లో ప్రారంభమైంది.
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుతో సుస్థిర ప్రగతికి ప్రభుత్వం బాటలేసింది. రాష్ట్రంలో 42 ఏళ్ల సుదీర్ఘకాలం తరువాత కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల్ని 26 జిల్లాలుగా విభజించింది ప్రభుత్వం. ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం ఒక యూనిట్‌గా తీసుకుని కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేసినా..అరకు భౌగోళికంగా పెద్దది కావడంతో రెండు జిల్లాలుగా చేశారు. మరోవైపు రెవిన్యూ డివిజన్లు 51 నుంచి 72కు పెరిగాయి. అటు కొత్త జిల్లాల్ని, ఇటు కొత్త రెవిన్యూ డివిజన్లను ఇవాళ ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కొక్కటిగా ప్రారంభించారు.
రాష్ట్రంలో ఇవాళ ఒక మంచి పనికి శ్రీకారం చుట్టామని వైఎస్ జగన్ తెలిపారు. రాష్ట్ర ప్రజలకు మంచి జరిగే గొప్పరోజుగా అభివర్ణించారు. పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ కోసమే జిల్లాల పునర్విభజన చేశామన్నారు. రాష్ట్రంలో కొత్తగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, నంద్యాల, సత్యసాయి, తిరుపతి, అన్నమయ్య జిల్లాలు ఉనికిలోకి రాగా, గతంలో ఉన్న జిల్లాలు అలానే ఉన్నాయన్నారు వైఎస్ జగన్. ఇప్పటివరకూ ఉన్న 13 జిల్లాల్లో కేంద్రాల్ని కాపాడుకున్నామన్నారు. 1970 మార్చ్‌లో ప్రకాశం జిల్లా, 1979 జూన్ నెలలో విజయనగరం జిల్లా ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు.
కొత్త జిల్లాల ఏర్పాటుతో కలెక్టర్లకు అధికారంతో పాటు ప్రజల పట్ల బాధ్యత, నిబద్ధత పెరిగిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుర్తు చేశారు. ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులనేవి అవసరమని..ప్రజలకు మరింత చేరువ కావాలని స్పష్టం చేశారు. నిన్నటి వరకూ రాష్ట్రంలో జిల్లాల సగటు జనాభా 38 లక్షలని..ఇది దేశంలో అత్యధికమని చెప్పారు. ఇప్పుడు సగటు జనాభా 20 లక్షలుండేలా చర్యలు తీసుకున్నామన్నారు.
Also read: AP Zilla Parishads: కొత్త జిల్లాలు సరే..జిల్లా పరిషత్ ల సంగతేంటి, రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతోంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook