ఏపీ బాలలకు సీఎం "చిల్డ్రన్స్ డే" కానుక

  

Last Updated : Nov 14, 2017, 09:09 PM IST
ఏపీ బాలలకు సీఎం "చిల్డ్రన్స్ డే" కానుక

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ బాలల కోసం బాలల దినోత్సవం సందర్భంగా వరాల జల్లులు కురిపించారు. ఫేస్బుక్ వేదికగా వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. "చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. బాలల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టింది. ఆరోగ్యవంతమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం అందజేస్తున్నాము. ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నాము. స్వేచ్ఛగా ఆడిపాడాలని, చదువుకోవాలని, మానసిక ఒత్తిడితో కూడిన విద్యకు స్వస్థి చెప్పాలని సూచించాను. బాలికలు బడిమానేయడాన్ని నిరోధించడానికి ‘బడికొస్తా’ అనే పథకం ప్రవేశపెట్టాము. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 4 వేల వర్చువల్ తరగతి గదులను ఏర్పాటు చేస్తున్నాము. సైకిళ్లు పంపిణీ చేశాము. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషిచేస్తున్నాము. విద్యార్ధులలో ప్రతిభను  ప్రోత్సహించడానికి ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్నాము" అని ముఖ్యమంత్రి సోషల్ మీడియా వేదికగా తెలిపారు. 

 

Trending News