ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ కు చంద్రబాబు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అ సందర్భంగా ఐటీ దాడులు, అధికారుల బదిలీలపై ఎన్నికల సీఈవోకు స్వయంగా వినతి పత్రం ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారు. సీఈవో నుంచి సంతప్తికరమైన సమాధానం రాకపోతే కార్యాలయం ఎదుటే ధర్నా చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది
మంగళవారం ప్రకాశం జిల్లా ఎస్పీ తో పాటు పలువురు కింద స్థాయి అధికారుల బదిలీకి ఈసీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో పాటు ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తోంది. ఈ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు తాడో పేడో తేల్చుకోవాలని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఐటీ దాడులు, ఐపీఎస్ అధికారుల బదిలీలపై అనేక సార్లు లేఖలు ఫిర్యాదు చేసినప్పడికీ .. ఈసీ స్పందించడం లేదని ట్రీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.