ఢిల్లీ: రీపోలింగ్ నిర్ణయంపై ఏపీ సీఎం చంద్రబాబు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరాను కలిశారు. ఈ సందర్భంగా ఈసీ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంత కాలం నుంచి టీడీపీ చేస్తున్న ఫిర్యాదుల పక్కన పెట్టి..వైసీసీ వారు చేసిన ఫిర్యాదులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు.
సీఈసీని కలిసిన అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ తన రాజకీయ జీవితంలో ఓ సీనియర్ నాయకుడిగా అనేక ఎన్నికలు చూశాను.. కానీ ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదన్నారు. ఈసీ నిర్ణయాలు వివాదాస్పదంగా ఉంటున్నాయంటూ ధ్వజమెత్తారు. తాము ఎన్ని ఫిర్యాదులు చేసిన పట్టించుకోని ఈసీ..వైసీపీ అడిగిన వెంటనే చంద్రగిరిలో రీ పోలింగ్ నిర్వహించడం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు.వైసీపీ ఫిర్యాదు మేరకు నిర్వస్తున్న రీపోలింగ్ నియమాలకు విరుద్ధంగా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు