ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ముమ్మరమైంది. త్వరలో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెరగనుంది. కొత్త జిల్లాల ఏర్పాటులో కీలకమైన ప్రక్రియగా ఉన్న పునర్ వ్యవస్థీకరణ కమిటీ ( Re Organisation Committee ) ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఇవాళ ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కీలకమైన అంశాలకు ఏపీ కేబినెట్ ( Ap Cabinet ) ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Cm Ys Jagan ) అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్లో ముఖ్యమైంది కొత్త జిల్లాల ( New Districts ) ఏర్పాటు. ఏపీలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల స్థానంలో 25 జిల్లాలు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఎన్నికలకు ముందు తన పాదయాత్రలో వైఎస్ జగన్ ( ys jagan padayatra ) ఈ మేరకు హామీ కూడా చేశారు. ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటు ఎలా ఉండాలనే విషయంపై డ్రాఫ్టింగ్ జరుగుతోంది. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా చేసే ఆలోచన ఉంది. అయితే ట్రైబల్ నియోజకవర్గంగా ఉన్న అరకు విషయంలో కాస్త సాంకేతికపరమైన ఇబ్బంది ఎదురు కానుంది. ఈ నేపధ్యంలో సాధ్యాసాధ్యాలు, పరిష్కారాలపై కమిటీ వేయాల్సి ఉంది.
కమిటీలో ఎవరుంటారు?
ఇవాళ జరిగిన కేబినెట్ భేటీ ( Cabinet meet ) లో ప్రధానంగా కొత్త జిల్లాలపైనే చర్చ సాగింది. కొత్త జిల్లాల ఏర్పాటులో కీలకమైన ప్రక్రియగా ఉన్న పునర్ వ్యవస్థీకరణ కమిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఛీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ఈ కమిటీ ఉంటుంది. సభ్యులుగా సీసీఎల్ఏ కమీషనర్, జీఏడీ సర్వీసెస్ సెక్రటరీ, ప్లానింగ్ డిపార్ట్ మెంట్ సెక్రటరీ, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రతినిధి, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు. Also read: Covid19: కాదంటే కఠిన చర్యలు: జగన్ వార్నింగ్
కొత్త జిల్లాల అవసరమేంటి?
జిల్లాల ఏర్పాటులో ఖర్చును నియంత్రించడం వంటి అంశాల్ని కమిటీ అధ్యయనం చేయనుంది. వీలైనంత త్వరగా కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉంది. మానవవనరుల్ని, మౌళిక సదుపాయాల్ని సరిగ్గా వినియోగించుకోవడం కొత్త జిల్లాల ఏర్పాటులో ముఖ్య ఉద్దేశ్యంగా ఉంది. గ్రామ, వార్డు సచివాలయాల్ని ఏర్పాటు చేయడంతో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అవసరం ఏర్పడిందని కేబినెట్ భావించింది. జిల్లాలు పెద్దవిగా ఉండటం, జనాభా అదికంగా ఉండటం కూడా కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రధాన కారణంగా ఉంది. Also read: Rajasthan: బీజేపీకు నో చెప్పిన సచిన్ పైలట్
సాంకేతిక ఇబ్బందులు:
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆలోచనలో కొన్ని ఇబ్బందులుండే అవకాశాలున్నాయి. ముఖ్యంగా అరకు పార్లమెంట్ ( Araku parliament ) ను జిల్లాగా ( Araku District ) ఏర్పాటు చేసినప్పుడు దూరమనేది సమస్యగా మారుతుంది. ఎందుకంటే అరకు నియోజకవర్గ పరిధిలో తూర్పు గోదావరి జిల్లా నుంచి మొదలుకుని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం వరకూ ప్రాంతాలున్నాయి. ఇది కచ్చితంగా సమస్యగా మారనుంది. బాపట్ల నియోజకవర్గ ( Bapatla Constituency ) ఏర్పాటులో ప్రకాశం జిల్లాలోని ( Prakasam District ) కొన్ని ప్రాంతాల దూరం ఎక్కువవుతుంది. కొత్తగా రాష్ట్రంలో కలిసిన విలీన మండలాలు 7 ఉన్నాయి. వీటిని ఏ జిల్లా పరిధిలో చేరుస్తారనేది మరో ప్రదాన సమస్యగా ఉంటుంది. ఇటువంటి ఇబ్బందుల్ని అధిగమిస్తూ ఓ పరిష్కారం సూచించడమే పునర్ వ్యవస్థీకరణ కమిటీ లక్ష్యంగా ఉంది. Also read: Kalonji Oil: ఆ ఆయిల్ తో అన్ని సమస్యలకు చెక్