Nomination Rules: నామినేషన్ దాఖలు సమయంలో ఎలాంటి తప్పులు చేయకూడదు

Nomination Dos and Donts: దేశంలో నాలుగో దశ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఏపీ అసెంబ్లీ సహా రెండు తెలుగు రాష్ట్రాల లోక్‌సభ ఎన్నికలు ఈ దశలోనే జరగనున్నాయి. దాంతో ఇవాళ తొలిరోజే నామినేషన్ల సందడి ప్రారంభమైంది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం నామినేషన్లకు సంబంధించి విధి విదానాలు జారీ చేసింది. అవేంటో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 18, 2024, 01:56 PM IST
Nomination Rules: నామినేషన్ దాఖలు సమయంలో ఎలాంటి తప్పులు చేయకూడదు

Nomination Dos and Donts: నాలుగోదశ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ వెలువడటంతోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఉదయం 11 గంటల్నించి మద్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నామినేషన్లు దాఖలు చేసేటప్పుుడు అభ్యర్ధులు చాలా జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. లేకపోతే నామినేషన్లు తిరస్కరణకు గురవుతాయి. 

ఒక్కో అభ్యర్ధికి గరిష్టంగా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు అవకాశముంటుంది. గరిష్టంగా 4 సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో మొత్తం 13 రకాల డాక్యుమెంట్లు తీసుకురావల్సి  ఉంటుంది. ఏ డాక్యుమెంట్ సరిగ్గా లేకపోయినా నామినేషన్ తిరస్కరింపబడుతుంది. లోక్‌సభకు పోటీ అభ్యర్ధి ఫారమ్ 2ఏ, అసెంబ్లీకు పోటీ చేసే అభ్యర్ధి ఫారం 2 బి సమర్పించాల్సి ఉంటుంది. 

సెలవు రోజుల్లో నామినేషన్లు వేసేందుకు వీలుండదు. నామినేషన్ దాఖలు చేసేటప్పుడు అన్ని కాలమ్స్ సరిగ్గా పూరించిందీ లేనిదీ సరి చూసుకోవాలి. ఇక అఫిడవిట్ ప్రతి పేజీలో అభ్యర్ధి సంతకం తప్పనిసరిగా ఉండాలి. ఏ ఒక్క  పేజిపై సంతకం లేకున్నా పరిశీలింపబడదు. ఇక డిపాజిట్ విషయంలో పార్లమెంట్‌కు పోటీ చేసే అభ్యర్ధి 25 వేల రూపాయలు, అసెంబ్లీకు పోటీ చేసే అభ్యర్ధి 10 వేల రూపాయలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు 50 శాతం సబ్సిడీ ఉంటుంది. 

తాజాగా మూడు నెలల్లోపు తీసుకున్న మూడు కలర్ ఫోటోలు నిర్ణీత సైజులో సమర్పించాలి. దీనికి సంబంధించి డిక్లరేషన్ కూడా ఇవ్వాలి. అభ్యర్ధి స్థానికేతరుడు అయితో ఎలక్టోరల్ రోల్ సర్టిఫైడ్ కాపీ సమర్పించాల్సి ఉంటుంది. ఇంకుతో సంతకం చేసిన ఫారం ఏ, ఫారం బీను రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. అన్ని డాక్యుమెంట్లు ఒరిజినల్ మాత్రమే ఇవ్వాలి. బ్యాలెట్ పేపర్ లేదా ఈవీఎం మెషీన్‌లో అభ్యర్ధి పేరు తెలుగు, ఇంగ్లీషు లేదా ఏ భాషలో ఉండాలో చెప్పాలి. ఇండిపెండెంట్ అభ్యర్ధులైతే ఎంచుకున్న సింబల్ సూచించాలి.

నామినేషన్ దాఖలు చేసినప్పట్నించి ఎన్నికల ఖర్చును అభ్యర్ధి ఖాతాతో లెక్కిస్తారు. వివిధ మీడియాల్లో వచ్చే పెయిడ్ ఆర్టికల్స్ , ప్రకటనల ఖర్చు కూడా ఇందులో భాగమే. నామినేషన్ దాఖలు చేసేటప్పుడు గరిష్టంగా 5మందికే ప్రవేశముంటుంది. అపిడవిట్, సంతానం, కుల ధృవీకరణ విషయంలో తప్పుడు సమాచారమిచ్చినట్టు తేలితే అతని సభ్యత్వమే రద్దవుతుంది. అందుకే ఈ మూడు అంశాల్లో సమాచారం సమగ్రంగా ఉండాలి. అంటే అతనిపై ఉండే కేసులు, ఆస్థులు, ఎంతమంది సంతానం వంటి వివరాలు సరిగ్గా ఉండాలి. 

Also read: AP Election Notification: ఏపీలో ఇవాళే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల విధి విధానాలు, షెడ్యూల్ ఇలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News