Stampede in Chandrababu Guntur Sabha: గుంటూరు బాబు సభలో తొక్కిసలాట..ముగ్గురి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం!

Stampede in Chandrababu Guntur Sabha: కందుకూరులో తొక్కిసలాట ఏర్పడి 8 మంది మృతి చెందగా ఇప్పుడు చంద్రబాబు గుంటూరు సభలో తొక్కిసలాట జరిగి ముగ్గురి మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయాలపాలయ్యారు.   

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 1, 2023, 08:23 PM IST
Stampede in Chandrababu Guntur Sabha: గుంటూరు బాబు సభలో తొక్కిసలాట..ముగ్గురి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం!

Another Stampede Happend in Chandrababu Guntur Sabha: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు టైం ఏ మాత్రం బాగున్నట్టు కనిపించడం లేదు. ఇటీవల కందుకూరులో ఏర్పాటు చేసిన ఒక బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి పలువురు కాలువలో పడి ప్రమాదం జరగగా అందులో ఎనిమిది మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడు నూతన సంవత్సరం మొదటి రోజే గుంటూరులో కూడా తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

నూతన సంవత్సరం సందర్భంగా చంద్రబాబు నాయుడు గుంటూరులో ఒక పెద్ద సభ ఏర్పాటు చేశారు. టిడిపి ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం నుంచి అర్హులకు పెన్షన్లు అందడం లేదు అని చాలా రోజుల నుంచి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో పెన్షన్లు లేని వారికి టీడీపీ తరఫున పెన్షన్లు ఇవ్వడానికి కొంతమందిని అర్హులను ఎంపిక చేసుకున్నారు. అలాగే జనతా వస్త్రాల పేరిట వస్త్రదానం కూడా చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

సంక్రాంతి సందర్భంగా కానుకలు ఇస్తామని పది రోజుల నుంచి టిడిపి పెద్ద ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు సభ లో ప్రసంగించి వెళ్లిపోయిన తరువాత పెన్షన్లు జనతా వస్త్రాల కౌంటర్ వద్దకు ఒక్కసారిగా ప్రజలందరూ వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ నేపద్యంలో తొక్కిసలాట జరగడంతో ఒక రమాదేవి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది, హాస్పిటల్ కు వెళ్ళాక మరో ఇద్దరు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్సులు కూడా అక్కడ అందుబాటులో లేని నేపథ్యంలో ప్రైవేటు వాహనాల్లోనే అప్పటికప్పుడు వారందరినీ తరలించి వైద్య సహాయం అందిస్తున్నారు.

ఇక ఈ సందర్భంగా స్థానికులు కొంతమంది చంద్రబాబు మీద తెలుగుదేశం మీద తీవ్ర స్థాయిలో ఫైర్ అయినట్లుగా ప్రచారం అయితే జరుగుతోంది. పండుగ రోజు తమను తీసుకువచ్చి చంపేయాలని అనుకుంటున్నారా? అంటూ వారు ప్రశ్నించినట్లు చెబుతున్నారు. పెన్షన్ల కోసం వారంతా ఒక్కసారిగా వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు వెళ్లిపోవడంతో పంపిణీ కార్యక్రమం జరుగుతుందో లేదో అని వారంతా పంపిణీ కార్యక్రమం జరుగుతున్న వైపు ఒక్కసారిగా వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా చెబుతున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే అందాల్సి ఉంది.

Also Read: Sheezan Khan Suicide: తునీషా కేసులో నిందితుడికి సూసైడ్ భయం.. లాయర్ సంచలన ఆరోపణలు!

Also Read: Rashmika-Vijay: మరోసారి అడ్డంగా దొరికేసిన విజయ్ దేవరకొండ- రష్మిక.. చూసుకోకపోతే ఎలా అబ్బా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News