AP Weather Forecast: బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం దిశమార్చుకుంది. ఈశాన్య దిశగా కదులుతూ మద్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుందని ఐఎండీ వివరించింది. ఫలితంగా రానున్న వారం రోజుల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ వర్షాలు ముప్పు దాదాపుగా తప్పినట్టే. అదే సమయంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై తుపాను ప్రభావం పడనుంది.
నైరుతి బంగాళాఖాతంలో ఇవాళ ఏర్పడనున్న అల్పపీడనం కాస్తా మే 24 నాటికి వాయుగుండంగా, తుపానుగా బలపడనుందని ఐఎండీ అంచనా వేసింది. మొదట్లో ఈ వాయుగుండం వాయువ్య బంగాళాఖాతం వైపు పయనిస్తుందని, ఫలితంగా కోస్తాంధ్ర , ఉత్తరాంధ్రపై తీవ్ర ప్రభావంతో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ ఇప్పుడీ అల్పపీడనం దిశ మార్చుకుని ఈశాన్య దిశగా కదులుతూ మద్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే పరిస్థితి కన్పిస్తోంది. దాంతో ఏపీకు తుపాను ముప్పు తప్పిందని ఐఎండీ వెల్లడించింది. అటు బంగ్లాదేశ్ తీరప్రాంతాలు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడవచ్చు.
మరోవైపు నైరుతి బంగాళాఖాతంపై సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఆవహించిన ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న మూడ్రోజులు అల్లూరి సీతారామరాజు, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. అంతేకాకుండా గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి.
రాష్ట్రంలో వారం రోజుల్నించి అక్కడక్కడా వర్షాలు పడుతుండటంతో ఉష్ణోగ్రతలు తగ్గాయి. కానీ ఇప్పుడు తుపాను ప్రభావం మద్య బంగాళాఖాతంవైపుకు పయనిస్తుండటంతో గాలిలో తేమ కూడా బంగ్లాదేశ్ వైపుకు పోతోంది. ఫలితంగా రానున్న రోజుల్లో ఏపీలో పగటి ఉష్ణోగ్రతలు మరోసారి పెరగనున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook