AP Weather updates: కోస్తాంధ్ర, రాయలసీమలో నేడు, రేపు భారీ వర్షాలు

AP Weather updates today: అమరావతి: నేడు, రేపు ఏపీలో అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా నేడు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 6, 2021, 07:34 AM IST
AP Weather updates: కోస్తాంధ్ర, రాయలసీమలో నేడు, రేపు భారీ వర్షాలు

AP Weather updates today: అమరావతి: నేడు, రేపు ఏపీలో అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా నేడు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కోస్తాంధ్ర, తమిళనాడును ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడటమే ఈ భారీ వర్షాలకు కారణం అని అధికారులు వివరించారు. 

ఇప్పటికే ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా మంగళవారం నెల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు (Heavy rain) కురిశాయి. కడప, చిత్తూరు జిల్లాల్లోనూ పలు చోట్ల భారీ వర్షపాతం నమోదైంది. 

Also read : NO Confidence Motion: కాకినాడలో గెలిచిన అవిశ్వాసం, ఓడిన మేయర్, డిప్యూటీ మేయర్

ఇదిలావుంటే, మరోవైపు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించిన తాజా వివరాల (IMD weather report) ప్రకారం.. రాగల 24 గంటల్లో వాయువ్య భారత దేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు తిరోగమించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also read : Dussehra Celebrations: విజయవాడ దసరా ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు, ట్రాఫిక్ ఆంక్షలు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News