AP New Districts: ఆంధ్రప్రదేశ్.. ఇక నుండి 13 కాదు.. 26 జిల్లాలు.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్‌.. ఉగాది నుంచే పాలన

AP New districts, Cabinet approves creation: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిన 13 జిల్లాల కలెక్టర్లు. ఒక నియోజకవర్గం మొత్తాన్ని ఒకే జిల్లాలోకి తీసుకురావాలని ప్రతిపాదన, అంటే ఏపీలో 18 నుంచి 20 లక్షల జనాభాతో ఒక డిస్ట్రిక్ట్ ఏర్పాటు కాబోతుంది.

Last Updated : Jan 26, 2022, 09:29 AM IST
  • కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్
  • పాలనా సౌలభ్యం దృష్ట్యా జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ
  • ఫిబ్రవరి 26 వరకు అభిప్రాయాల స్వీకరణ
AP New Districts: ఆంధ్రప్రదేశ్.. ఇక నుండి 13 కాదు.. 26 జిల్లాలు.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్‌.. ఉగాది నుంచే పాలన

Andhra Pradesh New Districts: ఏపీలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనల్ని మంత్రులందరికీ పంపిన తర్వాత ఆన్‌లైన్‌లో ఏపీ కేబినెట్‌ సమావేశం జరిగింది. ఇక అంతకుముందు ఈ ప్రతిపాదనలకు 13 జిల్లాల కలెక్టర్లు కూడా గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారు. రాష్ట్ర స్థాయి కమిటీ సిఫారసుల్ని జిల్లా కలెక్టర్లకు పంపిన ఏపీ (Andhra Pradesh) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ.. అలాగే సీసీఎల్‌ఏ నీరబ్‌కుమార్‌ప్రసాద్‌ ఆన్‌లైన్‌లో సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాల్ని తెలుసుకున్నారు. 

ఇక ఈ ప్రతిపాదనలకు కలెక్టర్లంతా కూడా ఆమోద ముద్ర వేశారు. ఇంకేవైనా అంశాలుంటే అవన్నీ కూడా తుది నోటిఫికేషన్‌ ఇచ్చేలోగా తెలియజేయాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు. 1974 ఏపీ డిస్ట్రిక్ట్‌.. ఫార్మేషన్‌ లా.. ప్రకారం కొత్త జిల్లాలతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్స్ కూడా ఏర్పాటు కానున్నాయి. మొత్తానికి ఏపీలో 26 కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి.

పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా ప్రజలకు సత్వర సేవల్ని అందించడమే లక్ష్యంగా సచివాలయాల వ్యవస్థ ఏర్పాటుతో పాటు పలు సంస్కరణలకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ (AP CM YS Jagan Mohan Reddy) మరో 
కీలక నిర్ణయం తీసుకున్నారు. 

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం.. ఏపీలో లోక్‌సభ నియోజకవర్గానికి ఒక జిల్లాను ఏర్పాటు చేస్తూ పునర్‌వ్యవస్థీకరణకు చర్యలు తీసుకున్నారు. ఇక జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీ గతంలో ఏర్పాటైంది. ఆ కమిటీ సిఫారసుల మేరకే 26 జిల్లాలుగా పునర్‌వ్యవస్థీకరణ ప్రతిపాదనల్ని సీఎం జగన్‌ ఆమోదించారు.

ఇక జిల్లాలను పునర్‌వ్యవస్థీకరిస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలపై.. ప్రజల నుంచి ప్రజా సంఘాల నుంచి కూడా ఫిబ్రవరి 26 వరకు అభిప్రాయ సేకరణ చేపడుతారు. 

ప్రజాభిప్రాయ సేకరణ మేరకే 26 కొత్త జిల్లాలను (AP New districts Proposal) ఏర్పాటు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అవుతుంది. ఉగాది నుంచి అంటే ఈ ఏడాది ఏప్రిల్‌ 2 నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభించాలనుకుంటోంది ఏపీ ప్రభుత్వం. ఒక నియోజకవర్గం మొత్తాన్ని ఒకే జిల్లాలోకి తీసుకురావాలని ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదన పెట్టింది. అంటే 18 నుంచి 20 లక్షల జనాభాతో ఒక డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. 

శ్రీకాకుళం లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాలతో పాటు విజయనగరం పార్లమెంట్ స్థానం పరిధిలోని ఎచ్చెర్ల శాసనసభ నియోజకవర్గాన్ని కలిపి శ్రీకాకుళం జిల్లాగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. ఎచ్చెర్ల తప్ప విజయనగరం లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్ని విశాఖ లోక్‌సభ స్థానం పరిధిలోని శృంగవరపు కోట శాసనసభ స్థానాన్ని కలిపి విజయనగరం జిల్లా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.

అలాగే శృంగవరపు కోట తప్ప విశాఖపట్టణం లోక్‌సభ స్థానం పరిధిలోని మిగతా 6 నియోజకవర్గాలతో కలిపి విశాఖపట్నం జిల్లాను ఏర్పాటు చేయాలని.. ప్రస్తుతం విశాఖపట్నం, విజయనగరం జిల్లాల పరిధిలోని పెదగంట్యాడ మండలాన్ని విశాఖ జిల్లా పరిధిలోకి తీసుకురావాలనే ప్రతిపాదన ఉంది. ఇలా ఏపీలోని చాలా ప్రాంతాల్ని జిల్లాలుగా మార్చనున్నారు. 

ఇక ఏపీలోని ప్రస్తుతం ఉన్న 13 జిలాల్లో 11 ఆంగ్లేయుల హయాంలోనే ఏర్పాటు అయ్యాయి. స్వాతంత్య్రం వచ్చి తర్వతా పాలన సౌలభ్యం దృష్ట్యా గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల నుంచి కొన్ని ప్రాంతాలతో కలిపి ఒంగోలు కేంద్రంగా ఫిబ్రవరి 2, 1970 న ప్రకాశం జిల్లా ఏర్పాటైంది. అలాగే విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలతో కలిపి విజయనగరం కేంద్రంగా 1979 జూన్‌ 1న చివరిగా విజయనగరం డిస్ట్రిక్ట్ (Districts) ఏర్పాటైంది. 

Also Read: Gold Price Today: పెరిగిన బంగారం ధరలు, దేశంలోని ప్రధాన నగరాల్లోని ఇవాళ్టి పసిడి ధరలు

అలాగే ఏపీలో ప్రస్తుతం 51 రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోని మదనపల్లె రెవెన్యూ డివిజన్‌ ఇందులో చాలా పెద్దది. ఇక పరిపాలన సౌలభ్యం దృష్ట్యా కొత్తగా 10 నుంచి 12 రెవెన్యూ డివిజన్స్‌ ఏర్పాటు చేయాలని ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదించింది.

Also Read: Sarkaru vaari paata: ప్రేమికుల రోజున మహేశ్​బాబు 'సర్కారు వారి పాట' తొలి సాంగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News