AP Capital Issue: ఏపీ రాజధానిపై నిర్ణయం కేంద్రానిదే, మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

AP Capital Issue: ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని వివాదం మరోసారి రచ్చగా మారుతోంది. రాజధానిపై నిర్ణయం కేంద్రానిదేనంటూ మంత్రి బొత్స సత్యనారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలతో రాజధాని అంశం మరోసారి వివాదాస్పదంగా మారింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 14, 2024, 07:01 PM IST
AP Capital Issue: ఏపీ రాజధానిపై నిర్ణయం కేంద్రానిదే, మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

AP Capital Issue: ఏపీలో రాజధాని అంశం చక్కర్లు కొడుతోంది. ఉమ్మడి రాజధాని నుంచి అమరావతి రాజధానిగా అక్కడ్నించి మూడు రాజధానులుగా మారింది. ఇప్పుడు మళ్లీ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అంశం తెరపైకి వస్తోంది. అధికార పార్టీ నేతలే ఈ అంశాన్ని ప్రచారం చేస్తున్నారు. 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పదేళ్ల వరకే హైదరాబాద్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉంటుందని అప్పట్లో విభజన చట్టంలో పొందుపరిచారు. ఆ తరువాత అధికారంలో వచ్చిన తెలుగుదేశం పార్టీ పదేళ్లు సమయం ఉన్నాసరే..అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసి రైతుల్నించి వేలాది ఎకరాలు సేకరించారు. పలు తాత్కాలిక భవనాలు నిర్మించి వదిలిపెట్టారు. పదేళ్ల సమయం ఉన్నా అంత తొందరపాటు దేనికనే విమర్శలు చెలరేగాయి అప్పట్లో. ఆ తరువాత 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఏకరూప రాజదాని కాదని మూడు రాజధానుల అంశాన్ని తీసుకొచ్చింది. ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా విశాఖపట్నం, లెజిస్టేటరీ రాజధానిగా అమరావతి, జ్యుడీషియరీ రాజధానిగా కర్నూలును ఎంపిక చేసింది ప్రభుత్వం. 

దాంతో భూములిచ్చిన రైతుల్నించి, ప్రతిపక్షాల్నించి వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో విచారణలో ఉంది. కేంద్రం రెండు మూడు సార్లు రాజధాని నిర్ణయించే అధికారం రాష్ట్రానిదేనని కేంద్రం జోక్యం చేసుకోదని స్పష్టం చేసింది. మరో 40 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. మరో నాలుగు నెలల్లో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు పదేళ్లు పూర్తి కానుంది. ఈ క్రమంలో వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం రాజధాని పూర్తయ్యేవరకూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించాలని కేంద్రాన్ని కోరనున్నట్టు తెలిపారు. 

ఇప్పుడు మరోసారి ఆ వ్యాఖ్యలకు కొనసాగింపుగా మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని నిర్ణయం కేంద్రానిదేనంటూ షాకింగా్ కామెంట్స్ చేశారు. విభజన చట్టంలోని అంశాలపై మాత్రమే తాము పోరాడతామన్నారు. పదేళ్లని చెప్పిన ఉమ్మడి రాజధాని గడువు పూర్తవుతున్నందున కేంద్రం తదుపరి నిర్ణయం తీసుకోవల్సి ఉందన్నారు. విశాఖలో రాజధాని నిర్మిద్దామంటే అడుగడుగునా అడ్డుకుంటున్నారన్నారు. 

మరోవైపు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగింపు అసాధ్యమన్నారు. ఇది తమ పార్టీ విధానమే కాదన్నారు. ఉమ్మడి రాజధాని అడిగేందుకు తామేమీ పిచ్చోళ్లం కాదన్నారు. అనుభవం ఉన్న నేతలెవరూ ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలు చేయరని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

Also read: AP Politics: గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం-జనసేన సీట్ల సర్దుబాటు ప్రశ్నార్ధకమే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News