ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ డ్రైవర్ లెస్ కారులో చక్కర్లు కొట్టారు. అయితే, అది జరిగింది అమరావతి రోడ్లపై మాత్రం కాదులెండి! అవును, అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో మంత్రి నారా లోకేష్ గూగుల్ ఎక్స్ వారి సరికొత్త ప్రయోగమైన డ్రైవర్ లెస్ కారులో చక్కర్లు కొట్టి అందులోని మజాను ఆస్వాదించారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఏఎన్ఐతో మాట్లాడుతూ.. స్వయంగా మంత్రిగారే ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు.
విశాఖపట్నంలో గూగుల్ ఎక్స్ సంస్థ ఓ అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని, ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం-గూగుల్ ఎక్స్ సంస్థల మధ్య ఓ ఒప్పందం జరిగిందని అన్నారు మంత్రి నారా లోకేష్. అదే క్రమంలో గూగుల్ ఎక్స్ వారి డ్రైవర్ లెస్ కారులో చక్కర్లు కొట్టి అందులోని మజాను ఆస్వాదించానని మంత్రి పేర్కొన్నారు. మంత్రి లోకేష్, గూగుల్ ఎక్స్ సీఈఓ ఆస్ట్రో టెల్లర్ ఈ మేరకు ఒప్పందం పత్రాలపై సంతకాలు చేశారు.
#Visuals of Andhra Pradesh IT Minister Nara Lokesh's ride in a driverless car, in San Francisco, USA pic.twitter.com/BYTV3bUBSh
— ANI (@ANI) December 15, 2017