Andhra Pradesh high court serious on ap traffic police: ఆంధ్ర ప్రదేశ్ లో హైకోర్టు రోడ్డు ప్రమాదాలపై సీరియస్ అయినట్లు తెలుస్తొంది. తాజాగా.. హైకోర్టు న్యాయవాది తాండవ యోగేష్ ఏపీ.. హైకోర్టులో పిల్ ను దాఖలు చేసినట్లు తెలుస్తొంది. గత మూడు నెలల్లో హెల్మెట్ లు లేకుండా.. ద్విచక్ర వాహన దారులు.. 667 మంది హెల్మెట్ ధరించకపొవడం వల్ల చనిపోయినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో హైకోర్టు న్యాయమూర్తులు ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమల పాటి రవిలతో ధర్మాసనం దీనిపై తాజగా విచారణ చేపట్టినట్లు తెలుస్తొంది. ఏపీ ట్రాఫిక్ పోలీసుల తీరును ధర్మాసనం తప్పుపట్టినట్లు తెలుస్తొంది.
టూవీలర్ మరణాలు మూడు నెలల్లో.. 667 మంది చనిపోవడం ఏంటని ప్రశ్నించినట్లు తెలుస్తొంది. దీన్ని బట్టి వాహనదారులు హెల్మెట్ ను పూర్తిగా వేసుకొవడంలేదని తెలుస్తుందన్నారు. వాహన దారులకు చలాన్ లు వేసి వదిలేయడం కాదని.. ఇక మీదట హెల్మెట్ లేకుండా దొరికితే..అలాంటి వారి ఇంటి విద్యుత్, నీటి కుళాయి నిలిపి వేసే దిశగా చర్యలు తీసుకొవాలని కోర్టు తెలిపినట్లు తెలుస్తొంది.
పొరుగున ఉన్న తెలంగాణ లో హెల్మెన్ ను వాడుతున్నప్పుడు.. ఇక్కడ ఎందుకు వాహనదారులు ఇంత నెగ్లీజెన్సీగా ఉంటున్నారని కూడా చెప్పినట్లు తెలుస్తొంది. అదే విధంగా దీనిపై తదుపరి విచారణకు.. ఈ నెల 18 న కోర్టు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా.. తమ ఎదుట రవాణా శాఖ కమిషనర్ తో పాటు.. , ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ఐజీ జనరల్ హజరు కావాలని కూడా... కోర్టు ఆదేశించినట్లు తెలుస్తొంది.
ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు తాజా ఉత్తర్వులు మాత్రం వార్తలలో నిలిచినట్లు తెలుస్తొంది. కోర్టు ఆదేశాలు ప్రకారం.. పోలీసులు ఇక మీదట హెల్మెట్ లేకుండా దొరికితే.. నీటి సేవలు, విద్యుత్ సరఫరాను నిలిపివేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా ఇతర అధికారులతో సమాలోచనలు చేస్తున్నారంట. ఈ నేపథ్యంలో మాత్రం ఏపీలో టూవీలర్ హెల్మెట్ ల అంశం ప్రస్తుతం వార్తలలో నిలిచిందని చెప్పుకొవచ్చు.
Read more: Manchu Vs Bhuma: ఫ్యాక్షన్ టర్న్ తీసుకుంటున్న మంచు కుటుంబ గొడవలు.. రంగంలోకి భూమా అఖిల ప్రియా..?..
సాధారణంగా టూవీలర్ మీద వెళ్లేటప్పుడు.. అనుకొకుండా ప్రమాదాలు జరుగుతాయి. చాలా సంఘటనల్లో తలకు గాయాలు కావడం వల్లే చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పుకొవచ్చు. అయితే.. హెల్మెట్ ఉంటే.. మాత్రం..ఈ ప్రమాదాల నుంచి బైటపడొచ్చని మాత్రం నిపుణులు చెబుతుంటారు. అందుకే.. పోలీసులు ఎప్పుడు హెల్మెట్ లు తప్పనిసరిగా ధరించాలని చెప్తుంటారు. కానీ కొంత మంది వాహనదారులు నెగ్లీజెన్సీగా ప్రవర్తించి... తమ ప్రాణాల్ని రిస్క్ లో వేసుకుంటున్నారని తెలుస్తొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.