Andhra Pradesh: వచ్చెనెలలో గ్రామ, వార్డు సచివాలయం పరీక్షలు

కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కారణంగా నిలిచిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీపై ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వచ్చేనెల చివరి నాటికి గ్రామ, వార్డు సచివాలయం పరీక్షలు ( Grama/Ward Sachivalayam Recruitment) పూర్తిచేయనున్నట్లు బుధవారం వెల్లడించింది.

Last Updated : Aug 12, 2020, 06:01 PM IST
Andhra Pradesh: వచ్చెనెలలో గ్రామ, వార్డు సచివాలయం పరీక్షలు

Grama/Ward Sachivalayam Recruitment:అమరావతి: కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి కారణంగా నిలిచిన గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగాల భర్తీపై ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh Govt) ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వచ్చేనెల చివరి నాటికి గ్రామ, వార్డు సచివాలయం పరీక్షలు ( Grama/Ward Sachivalayam Recruitment) పూర్తిచేయనున్నట్లు బుధవారం వెల్లడించింది. గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలపై ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana), పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి (Peddi Reddy Ramachandra Reddy) బుధవారం అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. Also read: Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయం పరీక్షలు వాయిదా

అయితే సెప్టెంబర్ 20 నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రులు వెల్లడించారు. వారం రోజుల పాటు పరీక్షలు జరుగుతాయని, వీటికి సుమారు 10 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతారని అంచనా వేస్తున్నామని మంత్రులు వెల్లడించారు. ఈ పరీక్షల నిర్వహణకు దాదాపు 3 నుంచి 5 వేల పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భౌతికదూరం పాటిస్తూ పరీక్షలు రాసేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రులు అధికారులకు సూచించారు. అదేవిధంగా పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ పోస్టుల భర్తీపై దృష్టి సారించాలని బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి అధికారులకు ఆదేశించారు. Also read: వైఎస్సార్‌ చేయూత పథకం ప్రారంభం.. వారి ఖాతాల్లోకి రూ.18,750

గ్రామ, వార్డు సచివాలయాల్లో 15,000 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరిలో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయితే ఈ ఉద్యోగాలను ఆగస్టులో భర్తీ చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి దృష్ట్యా జూలై 19న పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల్ కృష్ణ ద్వివేది ట్వీట్ చేసి వెల్లడించిన విషయం తెలిసిందే. Also read: Tigress Sheela: మూడు పిల్లలకు జన్మనిచ్చిన షీలా

Trending News