AP TET Notification 2024: ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల, రేపట్నించి దరఖాస్తుల స్వీకరణ

AP TET Notification 2024: ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్,. ఒకేరోజు రెండు నోటిఫికేషన్లు విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన కాస్సేపటికి ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 7, 2024, 06:24 PM IST
AP TET Notification 2024: ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల, రేపట్నించి దరఖాస్తుల స్వీకరణ

AP TET Notification 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త విన్పించింది. మొత్తం 6100 టీచర్ పోస్టు భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీ టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. రేపట్నించి దరఖాస్తులు స్వీకరించనున్నారు. 

ఏపీలో కొలువుల భర్తీ జరగనుంది. ఓ వైపు జూనియర్, డిగ్రీ కళాశాల లెక్చరర్ పోస్టుల భర్తీ మరోవైపు డీఎస్సీ, టెట్ నోటిఫికేషన్లతో నిరుద్యోగ విద్యార్ధులకు ఫుల్ బిజీ షెడ్యూల్ ఇది. 6100 పోస్టుల భర్తీకై డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 8 అంటే రేపట్నించి టెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 18 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 17 వరకే ఫీజు చెల్లించేందుకు వీలుంటుంది. ఈ నెల 19వ తేదీన మాక్ టెస్ట్ ఉంటుంది. ఫిబ్రవరి 23 నుంచి ఏపీ టెట్ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇక ఫిబ్రవరి 27 నుంచి మార్చ్ 9వ తేదీ వరకూ రెండు సెషన్స్‌లో టెట్ పరీక్షలు ఉంటాయి. టెట్ ప్రాధమిక కీ మార్చ్ 10న విడుదల కానుంది. ఈ కీపై అభ్యంతరాల్ని మార్చ్ 11న స్వీకరిస్తారు. ఫైనల్ కీ మార్చ్ 13న వస్తుంది. మార్చ్ 14వ తేదీన ఏపీ టెట్ తుది ఫలితాలుంటాయి. డీఎస్సీలో టెట్ పరీక్షల మార్కులకు 20 శాతం వెయిటేజ్ ఉండటంతో డీఎస్సీకు సిద్ధమయ్యే విద్యార్ధులకు టెట్ పరీక్ష కీలకం కానుంది. ఏపీ టెట్ పరీక్ష కంప్యూటర్ ఆధారంగా జరుగుతుంది. 

ఆంధ్రప్రదేశ్‌లో చివరిసారిగా 2018లో టెట్ పరీక్ష జరిగింది. ఆ సమయంలో 7,902 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. 6.08 లక్షల అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఏపీ టెట్ పరీక్ష రాసే విషయంలో గతంలో ఉన్న నిబంధనలు సవరించింది ఏపీ ప్రభుత్వం. 1 నుంచి 5 వరకూ బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్లకు నిర్వహించే టెట్ 1 పరీక్షకు రెండేళ్ల డీఎడ్ లేదా నాలుగేళ్ల బీఎడ్ చేసినవారు అర్హులు. ఇంటర్మీడియట్‌లో 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్ధులకు టెట్ పేపర్ 2ఏ రాసేందుకు డిగ్రీలో 50 శాతం మార్కులు ఉండాల్సి ఉండగా ఇకపై 40 శాతం ఉంటే సరిపోతుంది. గతంలో ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ చేసినవారికి అర్హత కల్పించి డీఎస్సీ-టెట్ కలిపి 100 మార్కులకు పరీక్ష ఉండేది. ఈసారి డీఎస్సీ, టెట్ వేర్వేరుగా నిర్వహిస్తోంది. 

Also read: Post Office RD: నెలకు 5 వేలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యురిటీ తరువాత 3.5 లక్షలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News