Konijeti Rosaiah is No More: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. శనివారం ఉదయం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో.. హైదరాబాద్జూబ్లీహిల్స్లోని ఓ ఆస్పత్రికి తరలించే లోపే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు (Konijeti Rosaiah Death) తెలిసింది.
1933 జూలై 4న గుంటూరులో జన్మించారు రోశయ్య. ఆయన వయసు (Konijeti Rosaiah Age) 88 సంవత్సరాలు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
Saddened by the demise of Former Chief Minister of Andhra Pradesh Sri K Rosaiah Garu. My heartfelt condolences to the family and loved ones. His demise has truly left a deep void in the lives of many who he inspired. pic.twitter.com/WjcQ94UeYJ
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 4, 2021
2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి రెండవ సారి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో.. కొణిజేటి రోశయ్య 2009 సెప్టెంబర్ 3 నుంచి 2010 నవంబర్ 24 వరకు ఏపీ సీఎంగా (AP former CM Rosaiah) సేవలందించారు. ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక మంత్రిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
2011 ఆగస్టు 31న నుంచి 2016 ఆగస్టు 30 వరకు తమిళనాడు గవర్నర్‌గా పని చేశారు రోశయ్య. అ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Breaking News: ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూత!
కొణిజేటి రోశయ్య ఇక లేరు
శనివారం తది శ్వాస విడిచిన ఏపీ మాజీ సీఎం
గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలు