AP Counting: ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓ వైపు ఎన్నికల కమీషన్ జాగ్రత్తలు తీసుకుంటోంది. మరోవైపు ప్రధాన పార్టీలు ఏజెంట్లకు సూచనలు జారీ చేస్తున్నాయి. కౌంటింగ్ సందర్భంగా ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను పెంచుతున్నారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జూన్ 4వతేదీన జరగనుంది. దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ కూడా అదే రోజు వివిధ రాష్ట్రాల్లో ఉంటుంది. పోలింగ్ సందర్భంగా ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో చెలరేగిన హింసాత్మక ఘటనల్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం. కౌంటింగ్ సందర్భంగా తీసుకోవల్సిన జాగ్రత్తలపై వైఎస్సార్ కాంగ్రెస్ , తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ఏజెంట్లకు సూచనలు జారీ చేశాయి. మరోవైపు ఏజెంట్లు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదనే అంశాలపై అధికారులు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల కౌంటింగ్ ఒకేసారి జరగనుంది. జూన్ 4వ తేదీన ఉదయం 8 గంటల్నించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమౌతుంది. ముందు సైనిక దళాల్లో పనిచేసే సిబ్బంది సర్వీసు ఓట్లను లెక్కించి ఆ తరువాత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు గణిస్తారు. ఈ ప్రక్రియకు దాదాపు 30 నిమిషాలు పట్టవచ్చు. ఆ తరువాత ఈవీఎంల లెక్కింపు మొదలవుతుంది. ఒక్కొక్క రౌండ్ పూర్తయ్యేందుకు అరగంట పట్టవచ్చు. అంటే ఉదయం 11 గంటలయ్యేసరికి స్పష్టత రావచ్చు. మొత్తం కౌంటింగ్ పూర్తయ్యేటప్పుటికి మద్యాహ్నం 3 గంటలు కావచ్చు. ఎందుకంటే ర్యాండమ్ వీవీ ప్యాట్ లెక్కింపు పూర్తయ్యాకే ఫలితాలు అధికారికంగా ప్రకటిస్తారు.
కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు అందరూ ఉదయం 4 గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవల్సి ఉంటుంది. ఎవరు ఏ టేబుల్ వద్ద విధులు నిర్వహించాలనేది అదే రోజు ఉదయం 5 గంటలకు వెల్లడిస్తారు. వివిధ నియోజకవర్గాల్నించి పోటీలో ఉన్న అభ్యర్ధులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్ చేస్తారు.
Also read: Southwest Monsoon: నైరుతి వచ్చేసింది, రేపు ఏపీలో ప్రవేశం, మోస్తరు నుంచి భారీ వర్షసూచన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook