Ys Sharmila son Wedding: జోధ్‌పూర్‌లో ఘనంగా వైఎస్ షర్మిల కుమారుడి పెళ్లి, హాజరుకాని జగన్

Ys Sharmila son Wedding: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి అత్యంత ఘనంగా జరిగింది. అందరూ ఊహించినట్టే ఈ పెళ్లికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరుకాలేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 18, 2024, 06:34 AM IST
Ys Sharmila son Wedding: జోధ్‌పూర్‌లో ఘనంగా వైఎస్ షర్మిల కుమారుడి పెళ్లి, హాజరుకాని జగన్

Ys Sharmila son Wedding: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఛీఫ్ వైఎస్ షర్మిల కుమారుడి పెళ్లి జోథ్‌పూర్‌లో అత్యంత ఘనంగా నిన్న అంటే ఫిబ్రవరి 17న జరిగింది. మూడ్రోజులపాటు జరగనున్నపెళ్లి వేడుకలు ఇవాళ ముగియనున్నాయి. పెళ్లి ఫోటోల్ని సోషల్ మీడియాలో వైఎస్ షర్మిల షేర్ చేశారు. 

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి, కాంగ్రెస్ ఛీఫ్ వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి  ప్రియా అట్లూరి వివాహం అత్యంత ఘనంగా జరిగింది. జోథ్‌పూర్ ప్యాలెస్‌లో జరిగిన ఈ పెళ్లికి ఇరువురు కుటుంబసభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. రాజకీయ అతిధులంతూ పెళ్లికి దూరంగా ఉన్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం పెళ్లికి హాజరుకాలేదు. ఈ నెల 16 నుంచి పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. సంగీత్, మెహందీ వంటి కార్యక్రమాలు జరిగాయి. నిన్న అంటే ఫిబ్రవరి 17సాయంత్రం వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియలు ఒక్కటయ్యారు. పెళ్లి ఫోటోలు బయటకు రాలేదు కానీ హల్తీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వధూవరులు వైట్ అంట్ వైట్ దుస్తుల్లో కన్పిస్తే..మిగిలినవారంతా పసుపు దుస్తుల్లో దర్శనమిచ్చారు. ఈ ఫోటోల్లో వైఎస్ షర్మిలతో పాటు ఆమె భర్త అనిల్ కుమార్, కుమార్తె అంజలి, తల్లి విజయమ్మ,  వధూవరులు, వధువు ప్రియ తల్లిదండ్రులు ఉన్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రత్యేక ప్రార్ధనలు జరగనున్నాయి. కొన్ని ప్రత్యేక కారణాలతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెళ్లికి హాజరు కాలేదు. కానీ నూతన వధూవరులు ఇంటికొచ్చాక జగన్ స్వయంగా వెళ్లి కలవనున్నట్టు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం తలంబ్రాలు, విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. 

Also read: Right to Education: ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత సీట్లకు నోటిఫికేషన్ జారీ

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News