AP: డ్వాక్రా మహిళలకు శుభవార్త.. ‘వైఎస్ఆర్ ఆసరా’ పథకానికి శ్రీకారం

ఆంధ్రప్రదేశ్‌ వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం మరో బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటినుంచి అన్నివర్గాలకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వ పథకాలను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు.. డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరేలా.. శుక్రవారం సీఎం జగన్ మరో నూతన పథకాన్ని ప్రారంభించారు.

Last Updated : Sep 11, 2020, 01:15 PM IST
AP: డ్వాక్రా మహిళలకు శుభవార్త.. ‘వైఎస్ఆర్ ఆసరా’ పథకానికి శ్రీకారం

CM YS Jagan launches ysr asara scheme: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరో బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటినుంచి అన్నివర్గాలకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వ పథకాలను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు.. డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరేలా.. శుక్రవారం సీఎం జగన్ మరో నూతన పథకాన్ని ప్రారంభించారు. ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ‘వైఎస్సార్‌ ఆసరా’ పథకాన్ని (ysr asara scheme) ప్రారంభించారు. అయితే.. ఎన్నికల ముందు డ్వాక్రా మహిళలకు ఆయన ఇచ్చిన హామీ నేటినుంచి ఆంధ్రప్రదేశ్‌లో అమలు కానుంది.  Also read: Parliament: చరిత్రలో నిలిచిపోనున్న పార్లమెంట్ సమావేశాలు

అయితే.. ఏపీలోని 8,71,302 పొదుపు సంఘాల్లో 87,74,674 మంది మహిళల పేరుతో బ్యాంకుల్లో రూ.27,168.83 అప్పు ఉంది. ఈ అప్పును ప్రభుత్వం నాలుగు విడతల్లో నేరుగా ఆయా సంఘాల పొదుపు ఖాతాల్లో జమ చేయనున్నట్లు సీఎం తెలిపారు. అయితే తొలి విడతలో భాగంగా రూ.6,792.20 కోట్లను ఆయా డ్వాక్రా సంఘాల ఖాతాల్లో ఈ రోజు జమ చేశారు. Also read: Cricket South Africa: దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుపై సస్పెన్షన్ వేటు

Trending News