CM Jagan: టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోట కుప్పంపై సీఎం జగన్ ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. ఆ నియోజకవర్గ నేతలతో వరుసగా సమావేశమవుతున్నారు. తాజాగా మరోపారు కుప్పం వైసీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. సుమారు గంటపాటు వారికి దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై చర్చించారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని ఆదేశించారు. స్థానిక ఎన్నికల్లో ఏవిధంగా గెలిచామో అదే ఫలితాలను 2024లో చూపించాలని నేతలకు సీఎం జగన్ పిలుపునిచ్చారు.
వచ్చే ఎన్నికల శంఖరావాన్ని కుప్పం నుంచి మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ పావులు కదుపుతున్నారు. ఇటీవల తాడేపల్లిలో వైసీపీ ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని స్థానాలను క్లీన్ స్వీప్ చేసే విధంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీని బలోపేతం చేయాలన్నారు.
మూడేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని స్పష్టం చేశారు. ప్రజల చెంతన ఉన్న వారికే టికెట్లు ఇస్తామన్నారు. మరోవైపు ప్రత్యేక కార్యక్రమాలతో వైసీపీ ప్రజల్లో ఉంటోంది. ఇంటింటికి వైసీపీ పేరుతో స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రజలకు చేరువవుతున్నారు. మంత్రులు సైతం బస్సు యాత్రలు చేపట్టారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత అమలు అవుతున్న పథకాలను ప్రజలకు వివరించారు. ఇటు ఎన్నికలు సమీపిస్తుండటంతో కీలక నేతలను ఆకర్షించేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌ల్లో ఉన్న కీలక నేతలను పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు ఓ టీమ్ తయారు అయినట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. సీఎం జగన్ మొదటి టార్గెట్ కుప్పంగానే కనిపిస్తోంది. 2019 ఎన్నికల నుంచి కుప్పంపై ఫోకస్ చేశారు. ఆ నియోజకవర్గాన్ని సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీ గెలుపులో ఆయన కీలక పాత్ర పోషించారు. వచ్చే ఎన్నికల్లోనూ పెద్దిరెడ్డి కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.
Also read:Smriti Mandhana: టీమిండియా మహిళా ప్లేయర్ స్మృతి మంధాన ఖాతాలోకి అరుదైన రికార్డు..!
Also read:Hansika Marriage: పెళ్లి పీటలు ఎక్కబోతున్న స్టార్ హీరోయిన్ హన్సిక..వరుడు ఎవరో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
CM Jagan: 175 టార్గెట్‌గా పనిచేయండి..కుప్పం నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం..!
ఏపీలో వైసీపీ జోరు
175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పావులు
కుప్పం నేతలతో సీఎం జగన్ మంతనాలు