Ammavodi Scheme: ప్రతి తల్లిదండ్రులు పిల్లల్ని చదివించేందుకు వీలుగా ఆర్ధిక ప్రోత్సాహం అందించే పధకం అమ్మ ఒడి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఈ పథకాన్ని మూడేళ్ల నుంచి క్రమం తప్పకుండా అందిస్తోంది. ఇప్పుడు నాలుగో ఏడాది అమ్మఒడి డబ్బులు విడుదల కానున్నాయి.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం బహిరంగ సభలో పాల్గొననున్నారు. రేపు ఉదయం 8 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలీకాప్డర్ ద్వారా కురుపాం చేరుకుంటారు. కురుపాంలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కి..అమ్మఒడి నిధుల్ని తల్లుల ఖాతాల్లో వేయనున్నారు. చదువుకునే పిల్లలున్న తల్లుల ఎక్కౌంట్‌లో ఏటా 15 వేల రూపాయలు అందిస్తున్నారు అమ్మ ఒడి పథకంలో.
రేపు జరగనున్న ముఖ్యమంత్రి జగన్ పర్యటనకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. సభాస్థలం, పార్కింగ్, వీఐపీ గ్యాలరీ, హెలీప్యాడ్ ప్రాంతాల్ని స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు పరిశీలించారు. జిల్లా ఏర్పడిన తరువాత తొలిసారి ముఖ్యమంత్రి జగన్ రానుండటంతో పెద్దసంఖ్యలో ప్రజలు రావచ్చని అంచనా. ఈ క్రమంలో ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు. రేపు ఉదయం 10.30 గంటలకు కురుపాం సభలో పాల్గొని..అక్కడి నుంచి మద్యాహ్నం 1 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు.
Also read: MLA Anil Kumar Yadav: సంచలన పరిణామం.. ఆ 18 మందిలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook