Krishna Projects Dispute: కృష్ణా ప్రాజెక్టుల అప్పగింత అంశం తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదం రాజుకునేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర యుద్ధం జరగ్గా.. తాజాగా ఈ వివాదం ఏపీకి కూడా పాకిందని కనిపిస్తోంది. తొలిసారి ఈ అంశంపై ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రేవంత్ సరైన తీరు కాదని మండిపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదని తప్పుబట్టారు. ఈ వివాదంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: Chalo Nalgonda: నల్లగొండ సభలో గర్జించిన కేసీఆర్.. తెలంగాణ కోసం పులిలా కొట్లాడుతానని వ్యాఖ్యలు
'కృష్ణా జలాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికావు. ఇది చాలా సున్నితమైన అంశం. పరస్పరం సహకరించుకోవాలి. కృష్ణా యాజమాన్య బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించలేమని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయడం ఎంతవరకు ధర్మం? నాగార్జున సాగర్ రెండు రాష్ట్రాల మధ్య సగం సగం ఉంది. విభజన చట్టాన్ని అంగీకరించి.. ఒక సెక్షన్ మాత్రం అంగీకరించలేం అంటే ఎలా?' అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. 'మేం కూడా ఏపీ కూడా విభజన చట్టాన్ని అంగీకరించం అంటే కుదురుతుందా? విభజన సమయంలో నదీజలాల పంపిణీపై చట్టంలో పొందుపరిచారు' అని గుర్తు చేశారు.
Also Read: Sharmila: జగనన్నకు చెల్లెమ్మ 9 ప్రశ్నలు.. 'దగా డీఎస్సీ'గా వర్ణించిన వైఎస్ షర్మిల
'ఇప్పుడు విభజన చట్టం అంగీకరించమని చెప్పడం అనేది మొండివాదన' అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. 'తెలంగాణ వాటాలో మాకు ఒక్క నీటి చుక్క కూడా అవసరం లేదు' అని స్పష్టం చేశారు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతానికి కేటాయించిన నీటి జలాలపై సీఎం వైఎస్ జగన్ చట్టబద్ధంగా ఉన్నారని.. ఆ విధంగా తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కృష్ణా జలాల పంపకాల ఇప్పటివీ కాదని గుర్తు చేశారు. ఈ సందర్భంగా గతంలో ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులను వివరించారు.
'బచావత్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీలు కేటాయించింది. ఒకసారి కేటాయించిన అంశాలను వివాదం ఎలా చేస్తారు?' అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. చట్టాన్ని గౌరవించాలని రేవంత్ రెడ్డికి హితవు పలికారు. ఇక హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా మళ్లీ కొనసాగించాలనే అంశంపై అంబటి స్పందిస్తూ.. 'హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలన్న వాదనలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి' అని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Ambati Rambabu: రేవంత్ రెడ్డి చట్టాన్ని గౌరవించనంటే ఎలా? ఏపీ మంత్రి అంబటి రాంబాబు