NMD Farooq: అఘోర చెప్పిందే జరిగింది.. రెండు నెలలు తిరక్కుండానే జాక్ పాట్ కొట్టేసిన ఆ నేత.. వైరల్ గా మారిన వీడియో..

Aghora prediction on nmd  farooq: ఆంధ్ర ప్రదేశ్‌ లో చంద్రబాబు సీఎంగా కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కేసరపల్లిలో జరిగిన చంద్రబాబు  పట్టాభిషేక వేడుకకు రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు హజరయ్యారు.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 13, 2024, 01:09 PM IST
  • ఏపీలో నిజమైన అఘోరా జోస్యం..
  • సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిన వీడియో..
NMD Farooq: అఘోర చెప్పిందే జరిగింది.. రెండు నెలలు తిరక్కుండానే జాక్ పాట్ కొట్టేసిన ఆ నేత.. వైరల్ గా మారిన వీడియో..

Aghora prediction on nandyal mla nmd farooq: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు వినూత్నంగా తీర్పునిచ్చారు. ఎన్నికలలో బీజేపీ, టీడీపీ, జనసేనను అఖండ మెజార్టీనిచ్చి దీవించారు. చంద్రబాబు తమ రాష్ట్రాన్ని తిరిగి డెవలప్ మెంట్ పథంలో తీసుకెళ్తారని భావించి, కూటమికి మంచి మెజార్టీతో విజయం అందించారు. అదేవిధంగా కూటమి నేతలు కూడా చక్కగా సమన్వయం చేసుకుని, ఎక్కడ కూడా ఓట్లు చీలకుండా, భేషజాలకు పోకుండా కూటమి సమిష్టి గెలుపు టార్గెట్ గా వైసీపీకి వ్యతిరేకంగా పోరాడారు. ప్రజలు కూడా అదే విధంగా కూటమిని ఆదరించారు. ఇదిలా ఉండగా.. ఏపీ రాజకీయాల్లో జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

 

 

సాధారణంగా ఎన్నికల జరుగుతుదనగానే రాజకీయ నేతలు ఎన్నికల ప్రచారాలలో బీజీగా ఉంటారు. అలాంటి సమయంలో కొందరు బాబాలు, అఘోరీలు, చిలుక జోస్యం చెప్పేవారు, సోది చెప్తామంటూ కొందరు రాజకీయ నాయకుల చుట్టుచేరుతుంటారు. మీ జాతకం మంచిగుందని, మిమ్మల్ని కొట్టేవాడు లేడంటూ వారి ఫ్యూచర్ చెప్తారు. ఇలాంటి ఘటనలను అందరు విశ్వసించకపోయిన,  కొందరు మాత్రం చెప్పినవి, చెప్పినట్లుగా జరిగిందని నమ్ముతుంటారు. అచ్చం ఇలాంటి ఒక అఘోరీ బాబా చెప్పింది, చెప్పినట్లు ఏపీ ఎమ్మెల్యే విషయంలో జరిగింది. 

పూర్తి వివరాలు..

ఆంధ్ర ప్రదేశ్ లోని..ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల నుంచి ఎన్‌ఎండీ ఫరూక్ చంద్రబాబు కేబినెట్‌లో చోటు సంపాదించారు. ఆయనకు గతంలో కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. నంద్యాలకు చెందిన సీనియర్ నేత ఫరూక్‌ ను తొలినుంచి  చంద్రబాబు ప్రయారీటి ఇస్తు వస్తున్నారు.  2014 ఎన్నికల్లో అనూహ్యంగా..  ఆయనకు టీడీపీ టికెట్ ఇవ్వలేదు కానీ.. ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రిగా కూడా అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో.. 2024 ఎన్నికల్లో ఫరూక్‌కు నంద్యాల నుంచి టీడీపీ టికెట్ కేటాయించింది. అయితే ఎన్నికల సమయంలో ఏప్రిల్ నెలలో ఆయన పార్టీ కార్యాలయంలో ఉండగా.. ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. 

ఫరూక్‌ నంద్యాల టీడీపీ కార్యాలయంలో ఉన్నప్పుడు ఓ అఘోరా అక్కడికి వచ్చారు. అక్కడికి అఘోరా రావడంతో అందరూ షాకింగ్ కు గురయ్యారు. ఫరూక్  ఆ సమయంలో.. కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్నారు... ఫరూక్ ముందు కూర్చుని నిన్ను ఓడించే వాడు ఎవరు లేరని అఘోరీ అన్నాడు. అన్ని అడ్డంకులు ఎదురొడ్డి మంత్రి పదవిని గెలుచుకొవడం ఖాయమని జోస్యంచెప్పాడు. హిందూ, ముస్లింలు సోదరభావంతో కలిసి ఉంటారని అఘోరా అన్నాడు. ఆ సమయంలో అఘోరీ బాబా అన్న మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్  గా మారింది.

Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

ఇప్పుడు అఘోర చెప్పిన జోస్యం నిజమైంది. అంతేకాదు అఘోరా చెప్పినట్లుగా ఫరూక్ ఓ కష్టాన్ని కూడా దాటారు.. ఆయన ఎన్నికల ప్రచార సమయంలో రోడ్డు ప్రమాదం నుంచి గాయలతో, బైటపడ్డారు. అఘోరా చెప్పినట్లుగానే.. చంద్రబాబు తన కేబినెట్ లో.. ఫరూక్ కు మంత్రి అవకాశం ఇచ్చారు.  ఈ నేపథ్యంలో మరోమారు అఘోరీ బాబా చెప్పింది నిజమైందంటూ ఆయన ఫ్యాన్స్ ఈ వీడియోను షేర్ చేసి గుర్తు చేస్తున్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News