ESI Scam:ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం కల్గించిన ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టుల పర్వం ప్రారంభమైంది. రాష్ట్రంలో నలుగురు కీలక వ్యక్తుల్ని ఈ కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
ఏపీలో ఈఎస్ఐ కుంభకోణం (ESI Scam)పెద్ద సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రదానమైన వ్యక్తుల అరెస్టు పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే నలుగురు వ్యక్తుల్ని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఈఎస్ఐ ఆసుపత్రి సూపరింటెండెంట్ బాల రవికుమార్ సహా ఓమ్ని ఎంటర్‌ప్రైజస్ యజమాని కంచర్ల శ్రీహరి, ఓమ్ని హెల్త్‌కేర్ యజమాని కంచర్ల సుజాత, మేనేజర్ వెంకటేశ్వర్లు అరెస్టయ్యారు. వైద్య పరికరాలు, మెడికల్ కిట్లను 50 నుంచి 4 వందల శాతం అధికరేట్లకు విక్రయించినట్టు ఏసీబీ నిర్ధారించింది. ప్రభుత్వ ఖజానాకు 35 కోట్ల మేర నష్టం కలిగినట్టు ఏసీబీ అధికారులు నిర్ధారించారు. అరెస్టైన నలుగురినీ కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు.
Also read: ప్రజలకు చేరువవుతున్న మేకిన్ ఇన్ ఇండియా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ కూ యాప్, ఖాతా తెరిచిన జగన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook