కేంద్రంలో కదలిక.. ఆంధ్రప్రదేశ్‌కి తీపి కబురు

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ గత కొన్ని రోజులుగా తెలుగు ఎంపిలు ఆందోళనలు నిర్వహించినా కేంద్రంలో కదలిక రాలేదు.

Last Updated : Apr 5, 2018, 08:42 AM IST
కేంద్రంలో కదలిక.. ఆంధ్రప్రదేశ్‌కి తీపి కబురు

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ గత కొన్ని రోజులుగా తెలుగు ఎంపీలు ఆందోళనలు నిర్వహించినా కేంద్రంలో ఇసుమంతైన కదలిక రాలేదు. కానీ హఠాత్తుగా ఏపీ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనతో కదలిక మొదలైనట్లు అనిపిస్తోంది. ఏదేమైనా ఏపీపై ఏ అంశంలోనూ ఇప్పటి వరకూ నోరు మెదపని కేంద్రం  ఏపీలో నాలుగు రైల్వే స్టేషన్లకు అంతర్జాతీయ హోదా కల్పించనున్నట్లు ప్రకటించింది.

త్వరలో ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రైల్వేస్టేషన్లకు అంతర్జాతీయ హోదా రాబోతోంది. ఇందులో అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న రెండు స్టేషన్లు ఎంపికయ్యాయి. విజయవాడ, గుంటూరు రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ స్టేటస్ కు ఎంపిక చేశారు. ఈ రెండు స్టేషన్లతో పాటు కర్నూలు, గుంతకల్లు రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ హోదాకు ఎంపిక చేశారు. స్టేషన్ల ఆధునికీకరణకు ఒక్కోదానికి రూ.25కోట్లు విడుదల చేస్తూ రైల్వే మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఈనెల పదిలోగా పంపాలని  రైల్వే శాఖ అందులో పేర్కొంది. అయితే  రైల్వే శాఖ ప్రకటించిన అంతర్జాతీయ హోదా రైల్వే స్టేషన్ల జాబితాలో విశాఖపట్టణం లేకపోవడం గమనార్హం.

Trending News