అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 17 కొత్త కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కోవిడ్19 బాధితుల సంఖ్య 40కు చేరుకుంది. కాగా, తాజా కేసులలో సైతం న్యూఢిల్లీలో నిజాముద్దీన్ దర్గాకు వెళ్లి మత పరమైన ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారే ఎక్కువగా ఉండటం గమనార్హం. సోమవారం రాత్రి 9గంటల నుంచి మంగళవారం ఉదయం వరకు ఈ కొత్త 17 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఉద్యోగుల జీతాల్లో భారీగా కోత.. మార్చి నుంచే అమలు
మార్చి 31న ఉదయం ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇందులో తాజాగా భారీ మొత్తంలో కోవిడ్ కేసులు నమోదైనట్లు ప్రకటించడం రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. సోమవారం వరకు 23కేసులతో తక్కువ సంఖ్యతో ఉన్న ఏపీ తాజా కేసులతో అత్యధిక కేసులు నమోదువుతున్న రాష్ట్రాలకు చేరువ కావడం గమనార్హం. కడుపుబ్బా నవ్వించే Corona జోక్స్
ప్రకాశం జిల్లా 11 మంది కోవిడ్ బాధితులతో తొలి స్థానంలో ఉంది. గుంటూరు 9, కృష్ణా 5, విశాఖ 6, తూర్పుగోదావరి 4, అనంతరం 2 పాజిటీవ్ కేసులు, కర్నూలు, నెల్లూరు జిల్లాలలో ఒక్కో కోవిడ్ కేసు నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. ఢిల్లీ నిజాముద్దీన్‌లో ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారిని వెంటనే ఆసుపత్రులకు వెళ్లి చికిత్స చేయించుకోవాలని అధికారులు సూచించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
శుభవార్త.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు
Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ
ఏపీలో మరో 17 కరోనా కేసులు