అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారి కలకలం రేపుతోంది. సోమవారం సాయంత్రం వరకు చాలా వరకు కంట్రోల్‌లో ఉన్న కరోనా పాజిటీవ్ కేసులు గత రెండు రోజుల్లో భారీగా పెరిగిపోయాయి. మంగళవారం (మార్చి 31) సాయంత్రం వరకు 44గా ఉన్న కోవిడ్19 పాజిటీవ్ కేసులు అనూహ్యంగా పెరిగిపోయాయి. తాజాగా 14 కేసులు నమోదు కావడంతో ఏపీలో కరోనా సోకిన వారి సంఖ్య 58కి చేరింది. ఏప్రిల్‌లో బ్యాంక్ సెలవులు ఇవే..
ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ నివేదికను ఆ జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు వాట్సాప్ ద్వారా వెల్లడించినట్లు సమాచారం. కేవలం పశ్చిమ గోదావరి ఒక్క జిల్లాలోనే ఈ 14 కేసులు నమోదు కావడం జిల్లా వాసులను కలవర పెడుతోంది. మంగళవారం సాయంత్రం నాటికి ఒక్క కేసు కూడా లేదని సంతోషించిన జిల్లా వాసులు ఒక్క సారిగా రాష్ట్రంలో అధిక కేసులున్న జిల్లాగా మారడంతో జాగ్రత్తలపై ఫోకస్ చేస్తున్నారు. కడుపుబ్బా నవ్వించే Corona జోక్స్
ప.గో జిల్లాలోని ఏలూరులో 6, భీమవరం, పెనుగొండలో 2 కేసులు, ఉండి, గుండుగొలను, ఆకివీడు, నారాయణపురం ప్రాంతాల్లో ఒక్కో కరోనా కేసు నమోదైనట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో జరిగిన మర్కజ్ జమాత్ ప్రార్థనల్లో పాల్గొన్న వారితో కలిపి జిల్లాలో 30 మంది శాంపిల్స్ పరీక్షించారు. 14 మందికి కోవిడ్ పాజిటీవ్, 10 మందికి నెగటివ్‌గా తేలినట్లు సమాచారం. మరో 6 శాంపిల్స్ ఫలితాలు రావాల్సి ఉంది. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ
షాకింగ్.. ఏపీలో మరో 14 కరోనా కేసులు..