Anas Mallick: తాలిబన్ల చెరలో 21 గం. పాటు వియాన్ రిపోర్టర్.. కవరేజీకి వెళ్లిన సమయంలో అపహరణ.. ఎట్టకేలకు సురక్షితంగా వెనక్కి

Wion Reporter Anas Mallick Abducted by Taliban: దాదాపు 21 గంటల పాటు తాలిబన్ల చెరలో ఉన్న ఆనస్ మాలిక్ ఎట్టకేలకు విడుదలయ్యారు. మాలిక్ సురక్షితంగా తన స్వదేశం పాకిస్తాన్‌కి చేరుకున్నారు.   

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 6, 2022, 06:47 AM IST
  • ఆఫ్గనిస్తాన్‌ కాబూల్‌లో వియాన్ రిపోర్టర్ ఆనస్ మాలిక్ అపహరణ
  • 21 గంటల పాటు తాలిబన్ల చెరలో ఉన్న ఆనస్ మాలిక్
  • ఎట్టకేలకు సురక్షితంగా విడుదలైన మాలిక్
Anas Mallick: తాలిబన్ల చెరలో 21 గం. పాటు వియాన్ రిపోర్టర్.. కవరేజీకి వెళ్లిన సమయంలో అపహరణ.. ఎట్టకేలకు సురక్షితంగా వెనక్కి

Wion Reporter Anas Mallick Abducted by Taliban: ప్రముఖ మీడియా సంస్థ 'వియాన్'కి చెందిన పాకిస్తాన్ బ్యూరో చీఫ్ ఆనస్ మాలిక్ గురువారం (ఆగస్టు 4) ఆఫ్గనిస్తాన్‌లోని కాబూల్‌లో అపహరణకు గురయ్యారు. ఆనస్ మాలిక్‌తో పాటు అతని వెంట వెళ్లిన లోకల్ ప్రొడ్యూసర్, డ్రైవర్‌ను తాలిబన్లు అపహరించారు. కారు నుంచి ఈ ముగ్గురిని బలవంతంగా కిందకు దింపిన తాలిబన్లు దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత చేతులకు బేడీలు వేసి, కళ్లకు గంతలు కట్టి తమ వాహనంలో తీసుకెళ్లారు. 

ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు అధికారం చేజిక్కించుకుని ఏడాది పూర్తయిన నేపథ్యంలో అక్కడి పరిస్థితులను రిపోర్ట్ చేసేందుకు ఆనస్ మాలిక్ పాకిస్తాన్ నుంచి కాబూల్ వెళ్లారు. బుధవారమే (ఆగస్టు 3) కాబూల్ చేరుకున్న ఆనస్ మాలిక్.. ఆ మరుసటిరోజు గ్రౌండ్ రిపోర్టింగ్‌కి వెళ్లారు. ఈ సందర్భంగా కాబూల్‌లో పలు ఫోటోలు, వీడియోలు తీశారు. ఇంతలో తాలిబన్లు అక్కడికి చేరుకుని మాలిక్ సహా ప్రొడ్యూసర్, డ్రైవర్‌పై దాడి చేశారు. ఆపై వారిని అక్కడి నుంచి మరో చోటుకు తరలించారు.

నిజానికి ఆనస్ మాలిక్ కాబూల్‌లో మీడియా కవరేజీకి సంబంధించిన అనుమతులన్నీ తీసుకున్నారు. ఆఫ్గనిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను సంప్రదించి అవసరమైన అనుమతులు పొందారు.ఇందుకు సంబంధించిన కొన్ని ఫార్మాలిటీస్‌ను పూర్తి చేశారు. అయినప్పటికీ తాలిబన్లు ఆనస్ మాలిక్‌పై దాడి చేసి అపహరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆనస్ మాలిక్ విడుదల కోసం 'వియాన్' సంస్థ ఆఫ్గనిస్తాన్‌లోని సంబంధిత అధికారులతో సంప్రదించింది. అదే సమయంలో అంతర్జాతీయ సమాజం నుంచి కూడా ఆనస్ మాలిక్ విడుదలకై తాలిబన్లపై ఒత్తిడి పెరిగింది.

ఎట్టకేలకు ఆనస్ మాలిక్ విడుదల.. సురక్షితంగా వెనక్కి :

దాదాపు 21 గంటల పాటు తాలిబన్ల చెరలో ఉన్న ఆనస్ మాలిక్ ఎట్టకేలకు విడుదలయ్యారు. మాలిక్ సురక్షితంగా తన స్వదేశం పాకిస్తాన్‌కి చేరుకున్నారు. కాబూల్‌లో తాను మళ్లీ రిపోర్టింగ్ చేయడానికి వెళ్తానని.. అయితే ప్రస్తుతం నెలకొన్న అమానవీయ పరిస్థితుల్లో మాత్రం అక్కడికి వెళ్లలేనని పేర్కొన్నారు. కాబూల్ స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 10.10 గం. సమయంలో తాలిబన్లు తనను విడుదల చేసినట్లు తెలిపారు. తన వెంట వచ్చిన లోకల్ ప్రొడ్యూసర్, కారు డ్రైవర్ మాత్రం ఇప్పటికీ తాలిబన్ల చెరలోనే ఉన్నారని పేర్కొన్నారు. వారిని కూడా వెంటనే విడుదల చేస్తామని చెప్పారని... కానీ వెంటనే అంటే ఎప్పుడు.. దానిపై క్లారిటీ రావాల్సి ఉందని చెప్పుకొచ్చారు.

ఆనస్ మాలిక్‌ను ఎందుకు అపహరించారు :

అగ్రరాజ్యం అమెరికా ఇటీవల అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరీని మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. కాబూల్‌లో జవహరీ ఉంటున్న నివాసంపై డ్రోన్ దాడులు చేసి అతన్ని అంతమొందించింది. ఈ ఘటనను తాలిబన్లు తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా అమెరికా కాబూల్‌లో దాడులకు పాల్పడిందని మండిపడ్డారు. ఈ పరిణామాలన్నింటినీ వియాన్ రిపోర్టర్ ఆనస్ మాలిక్ కవర్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆనస్ మాలిక్‌ను తాలిబన్లు అపహరించారు. 

Also Read: Etela Rajender: బీజేపీతో మరికొంత మంది టచ్‌లో ఉన్నారు..ఈటల రాజేందర్‌ కీలక వ్యాఖ్యలు..!

Also Read: ED on Casino: క్యాసినో వ్యవహారంలో ఎమ్మెల్యేలకు నోటీసులు..ఆ నలుగురు ఎవరంటే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News