US Cyclone: భారీ తుపాను అమెరికాలో బీభత్సం సృష్టిస్తోంది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. భీకరమైన గాలులు వీస్తున్నాయి. ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలతో యూఎస్ వణికిపోతోంది. ఉత్తర అమెరికాలో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది.
అగ్రరాజ్యం అమెరికాను భారీ తుపాను భయపెడుతోంది. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఉత్తర అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు ఆందోళన రేపుతున్నాయి. తుపాను తీవ్రతతో అమెరికాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. భీకర తుపాను కారణంగా 2600 విమానాలు రద్దయ్యాయి. లక్షలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. చాలా రాష్ట్రాల్లో 4-6 గంటలు అంధకారం నెలకొంది.
తుపాను కారణంగా భీకరమైన గాలులు, వడగండ్ల హెచ్చరికలు జారీ కావడంతో ఉత్తర, తూర్పు అమెరికా రాష్ట్రాల్లో ప్రజల్ని అప్రమత్తం చేశారు. వాషింగ్టన్ డీసీ ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. మేరీ ల్యాండ్, వర్జీనియా, ఫిలడెల్ఫియాలో భారత కాలమానం ప్రకారం నిన్న రాత్రి 4-5 గంటలు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దక్షిణ, మధ్య అట్లాంటిక్ రాష్ట్రాల్లో పెద్దఎత్తున ప్రజలు చీకటిలో ఉండిపోయారు. అలబామా నుంచి పశ్చిమ న్యూయార్క్ వరకూ సాగిన సుడిగాలికి 29.5 మిలియన్ల మంది ప్రభావితమయ్యారు. న్యూయార్క్, వాషింగ్టన్, ఫిలడెల్ఫియా, అట్లాంటా, బాల్టిమోర్ విమానాశ్రయంలో విమానాలు వచ్చేయాలని ఏవియేషన్ శాఖ హెచ్చరించింది. తుపాను కారణంగా చాలా విమానాలను దారి మళ్లించారు.7700 విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి.
ఉత్తర అమెరికాపై తుపాను ఎక్కువగా ప్రభావం చూపించిందని తెలుస్తోంది. లైబ్రరీలు, మ్యూజియంలు, నేషనల్ జూ, మున్సిపల్ ఇతర శాఖలు ముందస్తుగా మూసివేశారు. రద్దయిన 2600 విమానాల్లో వాషింగ్టన్ ఎయిర్ పోర్ట్‌లో 102, డల్లాస్‌లో 35 ఉన్నాయి. భారత కాలమానం ప్రకారం ఇవాళ సాయంత్రం నుంచి ఫిలడెల్ఫియా వంటి కొన్ని ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి నెలకొంది.
Also read: Pakistan Train Accident: పట్టాలు తప్పిన హజారా ఎక్స్‌ప్రెస్.. 15 మంది మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
US Cyclone: అమెరికాను వణికిస్తున్న భారీ తుపాను, అంధకారంలో ఉత్తర అమెరికా రాష్ట్రాలు