Taiwan parliament members kicks each others dramatic scene: ప్రజలు ఓట్లు వేసి తమకు మంచి చేస్తారని ఎంపీలు, ఎమ్మెల్యేలను చట్టసభలకు పంపిస్తుంటారు. తమ గొంతుకను వినిపంచి, తమకు నాయకులు మంచి చేస్తారని భావిస్తుంటారు. కానీ కొందరు నేతలు మాత్రం ఎన్నికయ్యే వరకు ఒకలా ఉండి, ఎన్నికయ్యాక మాత్రం పూర్తిగా మారిపోతుంటారు. కొందరు అసెంబ్లీలు, పార్లమెంట్ కు వెళ్లడంకూడా చేయరు.. కేవలం ఎన్నికైన ప్రజానిధుల మాదిరిగా సదుపాయాలు మాత్రం పొందుతుంటారు. ఈ నేపథ్యంలో కొందరు బిల్లులు ప్రవేశ పెట్టేక్రమంలో నాయకులు, అపోసిషన్ లీడర్ల మధ్య వాగ్వాదం జరుగుతుంటుంది. కొన్నిసార్లు ఇది కాస్త కొట్టుకొవడం వరకు కూడా పొతుంది. అనేక సందర్బాలలో మనం నాయకులు అసెంబ్లీలో మాటల యుద్దంచేసుకొవడం చూశాం. కొన్నిసార్లు పరస్పరం చేయిచేసుకున్న సంఘటనలు గతంలో జరిగాయి. మార్శల్స్ వీరిని బైటకు తీసుకెళ్లి తోసేస్తుంటారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం తైవాన్ లో జరిగింది. తైవాన్ పార్లమెంట్‌లో జరిగిన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
#BreakingNews: In #Taiwan, lawmakers punched, shoved and hit one another during #Parliament Friday while arguing about parliamentary reforms just says before president-elect Lai Ching-te takes office without a parliamentary majority. #LaiChingTe #violence #fight #politics #news pic.twitter.com/26qBcVukqo
— Robert Weiter (@robert_weiter) May 18, 2024
సంస్కరణ బిల్లులపై అధికార, ప్రతిపక్ష సభ్యులు వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా.. ఒకరిపై మరోకరు పిడిగుద్దులు కూడా కురిపించుకున్నారు. తైవాన్ అధికారుల ప్రకారం , శాసనసభ అధికారాలను విస్తరించడానికి ఉద్దేశించిన సంస్కరణల బిల్లుల శ్రేణిపై చట్టసభ సభ్యుల మధ్య శుక్రవారం వాగ్వాదం జరిగింది.
అధికార డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (DPP), ప్రతిపక్ష కోమింటాంగ్ (KMT), తైవాన్ పీపుల్స్ పార్టీ (TPP) మధ్య చర్చలు విఫలమైన తర్వాత ఉద్రిక్తత మరింత తీవ్ర స్థాయికి చేరుకుంది. ప్రతిపక్ష కోమింటాంగ్, తైవాన్ పీపుల్స్ పార్టీ కమిటీ సమీక్షను దాటవేయడానికి, బిల్లుల యొక్క వారి సంస్కరణలను వేగంగా ఆమోదం కోసం ప్రయత్నించాయి. దీంతో నేతల మధ్య విధానపరమైన తగాదాలకు దారితీశాయి. పార్టీ విప్‌ల మధ్య తీవ్రమైన ఘర్షణతో సెషన్ ప్రారంభమైంది. పోడియంపై నియంత్రణ కోసం చట్టసభ సభ్యులు తర్జనభర్జనలు చేయడంతో భౌతిక వాగ్వాదానికి దిగారు. శుక్రవారం జరిగిన సెషన్ అంతా గందరగోళంగా కొనసాగింది. ఈ ఘటనలో.. చాలా మంది సభ్యులు పరస్పరం కొట్టుకున్నారు. దీంతో వారికి తీవ్రమైన గాయాలయినట్లు తెలుస్తోంది.
Read more: Dice Snakes: ఆస్కార్ లెవల్ పర్ఫామెన్స్.. చచ్చిపోయినట్లు నటిస్తున్న పాములు.. కారణం ఏంటో తెలుసా..?
స్పీకర్ హాన్ కుయో-యు అక్కడి పరిస్థితిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ అక్కడి ఎవరు వెనక్కు తగ్గలేదు.
అధికార డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ నిలుపుదల వ్యూహాలను ఉపయోగించింది. ప్రతిపక్ష కోమింటాంగ్ వారి స్థానాన్ని తీవ్రంగా సమర్థించింది. కానీ అసెంబ్లీలో మాత్రం.. చర్చలు పదేపదే విఫలమయ్యాయి, ఈ నేపథ్యంలో.. DPP చట్టసభ సభ్యుడు సెక్రటరీ జనరల్ నుండి పత్రాలను లాక్కున్నప్పుడు నాటకీయ క్షణం సంభవించింది. శుక్రవారం అర్థరాత్రి వరకు, సెషన్ ప్రతిష్టంభనగా ఉంది. వివాదాస్పద సంస్కరణలపై పురోగతికి ఆటంకం కల్పించే విధంగా ఘటనలు జరిగాయి. ఈఘటనలో.. ఐదుగురు శాసనసభ్యులను గాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter