రష్యా యుద్ధ విమానాలను అడ్డుకున్న మరో యుద్ధ విమానం

రష్యాకు చెందిన రెండు సుఖోయ్ Su-27s ( Sukhoi Su-27s) యుద్ధ విమానాలను ఫిన్‌లాండ్‌కి చెందిన F/A-18C హార్నెట్ యుద్ధ విమానం అడ్డుకోవడం ఆ రెండు దేశాల మధ్య ఒకింత ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.

Last Updated : Jul 30, 2020, 06:58 PM IST
రష్యా యుద్ధ విమానాలను అడ్డుకున్న మరో యుద్ధ విమానం

రష్యాకు చెందిన రెండు సుఖోయ్ Su-27s ( Sukhoi Su-27s) యుద్ధ విమానాలను ఫిన్‌లాండ్‌కి చెందిన F/A-18C హార్నెట్ యుద్ధ విమానం అడ్డుకోవడం ఆ రెండు దేశాల మధ్య ఒకింత ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. జూలై 28న రష్యాకు చెందిన రెండు సుఖోయ్ యుద్ధ విమానాలు సరిహద్దులు దాటి తమ గగనతలంలోకి వచ్చాయని ఫిన్ ల్యాండ్ ఆరోపిస్తుండగా.. రష్యా మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. ఫిన్‌ల్యాండ్ స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో హెల్‌సింకి తీరంలో అర కిలోమీటర్ దూరం ఫిన్‌లాండ్ గగనతలంలోకి చొచ్చుకువచ్చిన సుఖోయ్ యుద్ధ విమానాలు... దాదాపు 2 నిమిషాల పాటు చక్కర్లు కొట్టి వెళ్లాయని ఫిన్‌ల్యాండ్ రక్షణ శాఖకు చెందిన మీడియా అండ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ నినా హిర్‌స్కీ తెలిపారు. సుఖోయ్ యుద్ధ విమానాల రాకగు గుర్తించే తాము F/A-18C హార్నెట్ యుద్ధ విమానాన్ని ( Finland's F/A-18C Hornets) రంగంలోకి దింపామని ఆమె పేర్కొన్నారు. Also read: Rafale fighter jets: పాకిస్తాన్, చైనాలకు భారత్ వార్నింగ్ 

ఫిన్‌ల్యాండ్ చేస్తున్న ఈ ఆరోపణలపై రష్యా స్పందిస్తూ.. నాలుగు సుఖోయ్ యుద్ధ విమానాలు షెడ్యూల్ ప్రకారం రష్యాలోని నార్త్ వెస్ట్ కరెలియా నుంచి కలినింగ్రాండ్‌కి వెళ్లింది వాస్తవమే కానీ.. ఆ విమానాలు ఏ ఇతర దేశాల గగనతలంలోకి ప్రవేశించలేదని తెలిపింది. ఈ మేరకు రష్యా రక్షణ శాఖ వివరణ ఇచ్చినట్టుగా రష్యన్ న్యూస్ ఏజెన్సీ TASS వెల్లడించింది. పైలట్స్ నిరంతరం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందితో టచ్‌లోనే ఉన్నారని రష్యా రక్షణ శాఖ చెప్పినట్టుగా టాస్ పేర్కొంది. Also read: #Watch Rafale fighter jetsకి అంబాలాలో ఘన స్వాగతం

పొలాండ్-లిత్వేనియా మధ్య ఉన్న కలినింగ్రాడ్‌కి రష్యా తరచుగా తమ యుద్ధ విమానాలను పంపిస్తుంటుంది. బాల్టిక్ సీ, గల్ఫ్ ఆఫ్ ఫిన్ ల్యాండ్ మీదుగా ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్ స్పేస్ ద్వారానే రష్యా విమానాలు కలినింగ్రాడ్‌కి వెళ్తుంటాయి. Also read: Rafale Facts: రాఫెల్ విమానాల గురించి మీకు తెలియని 10 విషయాలు

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x