Covid19 Deaths: రష్యాలో మరణమృదంగం మోగిస్తున్న కరోనా వైరస్, ఒక్కరోజులోనే

Covid19 Deaths: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇంకా పట్టిపీడిస్తూనే ఉంది. గత కొద్దిరోజులుగా రష్యాలో కరోనా వైరస్ మరణమృదంగం మోగిస్తోంది. భారీగా మరణాలు నమోదవుతూ ఆందోళనకరంగా మారింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 17, 2021, 08:05 AM IST
  • రష్యాలో మరణమృదంగం మోగిస్తున్న కరోనా మహమ్మారి
  • ఒక్కరోజులోనే కోవిడ్ కారణంగా వేయిమంది మృతి
  • గత 24 గంటల్లో రష్యాలో 33 వేల కొత్త కేసులు నమోదు
Covid19 Deaths: రష్యాలో మరణమృదంగం మోగిస్తున్న కరోనా వైరస్, ఒక్కరోజులోనే

Covid19 Deaths: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇంకా పట్టిపీడిస్తూనే ఉంది. గత కొద్దిరోజులుగా రష్యాలో కరోనా వైరస్ మరణమృదంగం మోగిస్తోంది. భారీగా మరణాలు నమోదవుతూ ఆందోళనకరంగా మారింది. 

ప్రపంచంలో కరోనా వైరస్(Coronavirus)కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఇండియాలో కేసులు కాస్త తగ్గుముఖం పట్టినా ఇతర దేశాల్లో సంక్రమణ పెరుగుతోంది. ముఖ్యంగా రష్యాలో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. రష్యాలో కరోనా మరణాలు అధికమవుతున్నాయి. ఆ దేశంలో గత 24 గంటల్లో ఏకంగా వేయిమంది కోవిడ్ కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. గత 24 గంటల్లో రష్యాలో 33 వేల 208 కొత్త కేసులుCoronavirus Cases in Russia)నమోదయ్యాయి. ఆ దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 79 లక్షల 58 వేల 384కు చేరుకుంది. ఇప్పటి వరకూ 2 లక్షల 22 వేల 315 మంది ప్రాణాలు కోల్పోయారు. యూరప్ దేశాల్లో అత్యధికంగా కరోనా మరణాలు రష్యాలోనే సంభవించాయి. అమెరికా, బ్రెజిల్ , మెక్సికో, ఇండియాలతో పాటు ఇప్పుడు రష్యాలో కూడా భారీగా కేసులు నమోదవుతున్నాయి. రష్యాలో ఓ వైపు కరోనా మరణాలతో మరణమృదంగం మోగుతున్నా ఆ దేశ ప్రభుత్వం మాత్రం కరోనా ఆంక్షలు విధించే విషయాన్ని స్థానిక యంత్రాంగాలకే వదిలిపెడుతోంది. అటు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా రష్యాలో నెమ్మదిగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ కేవలం 29 శాతం మందికే వ్యాక్సిన్ ఇచ్చారు. 

అదే సమయంలో ఇండియాలో కరోనా రికవరీ రేటు 98.08 శాతానికి చేరింది. గత 24 గంటల్లో ఇండియాలో 15 వేల 981 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 8 రోజులుగా దేశంలో 20వేల కంటే తక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 2 లక్షల 1 వేయి 632కు చేరింది.ఇది 218 రోజుల కనిష్ట స్థాయిగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు ఇండియాలో ఇప్పటి వరకూ 59 కోట్లమందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests)చేయగా..97.23 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చారు.

Also read: Water Pollution: ఆ దేశంలో భూగర్భ జలాల్లో కిరోసిన్, డీజిల్ గుర్తింపు, ఆ నీరు తాగవద్దని హెచ్చరికలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News